విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ

ABN, Publish Date - Jul 27 , 2026 | 08:50 PM

నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్స్‌లో విద్యార్థులకు మంత్రి నారాయణతోపాటు ఆయన కుటుంబ సభ్యులు సోమవారం (27-07-2026) సైకిళ్లు పంపిణీ చేశారు. నగర కార్పొరేషన్ పరిధిలో 7 వేల మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేశారు.

విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ 1/8

నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్స్‌లో విద్యార్థులకు మంత్రి నారాయణతోపాటు ఆయన కుటుంబ సభ్యులు సోమవారం (27-07-2026) సైకిళ్లు పంపిణీ చేశారు. నగర కార్పొరేషన్ పరిధిలో 7 వేల మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేశారు.

విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ 2/8

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఈ రోజు ఎంతో ఆనందకరమైన రోజు అని తెలిపారు. తాను పేదరికం అంటే ఏమిటో జీవితంలో స్వయంగా అనుభవించానని గుర్తు చేసుకున్నారు. గుడిసెలో జన్మించిన తాను కష్టాల్లో పెరిగానని తెలిపారు.

విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ 3/8

చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పారు. హరనాథపురం నుంచి వీఆర్సీ వరకు కాలినడకన వెళ్లి చదివిన రోజులు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని వివరించారు. తన తండ్రి ప్రైవేట్ బస్ కండక్టర్‌గా పని చేసి.. తెచ్చిన జీతంతోనే కుటుంబం గడిచేదని పేర్కొన్నారు.

విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ 4/8

అప్పుడే పేదరికాన్ని జయించాలని తాను నిర్ణయించుకొన్నానని అన్నారు. వీఆర్సీ ఆధునీకరణలో విద్యా యజ్ఞం ప్రారంభించానని తెలిపారు.

విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ 5/8

యువనేత లోకేశ్ ఆలోచనలకి అనుగుణంగా రూ.17 కోట్లతో వీఆర్సీని సిద్ధం చేశామన్నారు. తన పిల్లలు పనులన్నీ పక్కన పెట్టి వీఆర్ హైస్కూల్‌ని అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పారు. 1,100 మంది నిరుపేద విద్యార్థులకి అడ్మిషన్ కల్పించామని తెలిపారు.

విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ 6/8

అదే స్ఫూర్తితో దాతల సహకారంతో సిటీలోని మరో 14 ప్రభుత్వ హైస్కూల్స్ ఆధునీకరిస్తున్నామని వివరించారు. ఈ రోజు వేలాదిమంది నిరుపేద పిల్లల్లో తనకు తన బాల్యం కనిపిస్తోందని పేర్కొన్నారు.

విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ 7/8

విద్యాభివృద్ధి కోసం మంత్రి లోకేశ్ చూపిస్తున్న దారిలో మనమంతా కలిసి ముందుకు సాగుతున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలనకు సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన P4కి తన వంతు సహాయ సహకారం అందిస్తానని స్పష్టం చేశారు.

విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి నారాయణ 8/8

విద్యాభివృద్ధి కోసం మంత్రి లోకేశ్ చూపిస్తున్న దారిలో మనమంతా కలిసి ముందుకు సాగుతున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలనకు సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన P4కి తన వంతు సహాయ సహకారం అందిస్తానని స్పష్టం చేశారు.

Updated at - Jul 27 , 2026 | 08:58 PM