లోకేశ్ నివాసంలో ఆత్మీయ విందు.. హాజరైన ప్రజా ప్రతినిధులు
ABN, Publish Date - Feb 19 , 2026 | 01:09 PM
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్.. కూటమి పార్టీల మధ్య వారధిగా, ఆత్మీయ అతిథ్య సారథిగా నిలుస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ప్రజా ప్రతినిధులతో ఆయన ఆత్మీయ సమావేశాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉండవల్లిలోని తన నివాసానికి అనంతపురం, హిందూపురం లోక్‌సభ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు మంత్రి లోకేశ్ ఆత్మీయ స్వాగతం పలికారు.
1/11
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్.. కూటమి పార్టీల మధ్య వారధిగా, ఆత్మీయ అతిథ్య సారథిగా నిలుస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
2/11
పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ప్రజా ప్రతినిధులతో ఆయన ఆత్మీయ సమావేశాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.
3/11
బుధవారం ఉండవల్లిలోని తన నివాసానికి అనంతపురం, హిందూపురం లోక్‌సభ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు మంత్రి లోకేశ్ ఆత్మీయ స్వాగతం పలికారు.
4/11
ఈ విందు సమావేశం కుటుంబ వేడుకను తలపించేలా సందడిగా సాగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అనే భేదాలు లేకుండా అంతా స్నేహపూర్వక సంభాషణలతో కొనసాగింది.
5/11
కుటుంబ సభ్యులను తీసుకురాని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ఆస్మిత్ రెడ్డిని మంత్రి నారా లోకేష్ ఆట పట్టించారు.
6/11
చిన్నారులను ఎత్తుకుని ముద్దాడి.. వారితో లోకేశ్ సరదాగా గడిపారు. ప్రజాప్రతినిధులకు ఒక ఫైల్‌ను లోకేశ్ సిబ్బంది అందజేశారు. అవి చూసిన ప్రజాప్రతినిధులు ఆశ్చర్యపోయారు.
7/11
తాము ఇచ్చిన వినతులు ఏవి పరిష్కారమయ్యాయో? ఏవి కాలేదో నివేదిక రూపంలో ఇచ్చిన మంత్రి లోకేష్ బాధ్యతాయుత సంస్కారాన్ని చూసి వారంతా మెచ్చుకున్నారు.
8/11
తన ఇంటికి వచ్చిన సోదరీమణులందరికీ మంగళగిరి వీవర్‌శాల నుంచి తెప్పించిన పట్టుచీరలను మంత్రి నారా లోకేశ్ అందజేశారు.
9/11
ఈ కార్యక్రమానికి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, మంత్రి పయ్యావుల కేశవ్ (ఉరవకొండ), ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు (రాయదుర్గం) హాజరయ్యారు. గుమ్మనూరు జయరాం (గుంతకల్లు), జేసీ అస్మిత్ రెడ్డి (తాడిపత్రి), బండారు శ్రావణిశ్రీ (సింగనమల) విచ్చేశారు.
10/11
దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ (అనంతపురం అర్బన్), అమిలినేని సురేంద్రబాబు (కళ్యాణ దుర్గం), హిందూపురం ఎంపీ బీకే పార్థసారధి వచ్చారు.
11/11
మంత్రి సవిత (పెనుకొండ), మంత్రి సత్యకుమార్ (ధర్మవరం-బీజేపీ), ఎంఎస్ రాజు (మడకశిర) వచ్చారు. పల్లె సింధూరరెడ్డి (పుట్టపర్తి), కందికుంట వెంకటప్రసాద్ (కదిరి), పరిటాల సునీత (రాప్తాడు)లు తమ కుటుంబసభ్యులతో లోకేశ్ ఇచ్చిన ఆత్మీయ విందుకు హాజరయ్యారు.
Updated at - Feb 19 , 2026 | 01:24 PM