ఆకట్టుకున్న పశువుల అందాల పోటీలు
ABN, Publish Date - Jan 11 , 2026 | 08:47 AM
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని మీర్జాపురంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొని, పల్లె సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలను తిలకించారు. ఈ ప్రదర్శనలో గిర్, ఒంగోలు జాతి ఎడ్లు, పాడి గేదెలను ప్రదర్శించారు.
1/12
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని మీర్జాపురంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొని, పల్లె సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలను తిలకించారు.
2/12
ఈ ప్రదర్శనలో గిర్, ఒంగోలు జాతి ఎడ్లు, పాడి గేదెలను ప్రదర్శించారు. మంత్రి పార్థసారథి స్వయంగా ప్రదర్శన క్షేత్రాన్ని సందర్శించి, మేలు రకం పశువుల వివరాలను, వాటి పోషణ పద్ధతులను అడిగి తెలుసుకున్నారు.
3/12
పశువుల ప్రదర్శనలో అత్యుత్తమంగా నిలిచిన పశువుల యజమానులకు మంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
4/12
పశువులను శాస్త్రీయ పద్ధతిలో పెంచుతూ, అత్యధిక పాల దిగుబడిని సాధిస్తున్న మేలు రకం జాతులను సంరక్షిస్తున్న రైతులకు ఈ వేడుకలో గుర్తింపు లభించింది.
5/12
పశువుల ప్రదర్శనలో అత్యుత్తమంగా నిలిచిన పశువుల యజమానులకు మంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
6/12
పాడి ఉత్పత్తుల రంగంలో వినూత్నంగా వ్యవహరిస్తున్న పెంపకందారులను ఘనంగా సన్మానించారు.
7/12
ఈ సందర్భంగా రైతులతో మంత్రి పార్థసారథి మాట్లాడారు. పాడి పరిశ్రమలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించారు.
8/12
రైతు దేశానికి వెన్నెముక అయితే, పాడి పశువులు రైతుకు కొండంత అండ అని చాటిచెప్పేలా మీర్జాపురంలో భారీ స్థాయిలో పశువుల ప్రదర్శన, పాడి ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారని ప్రశంసించారు.
9/12
సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అని.. మన పాడి సంపదను, వ్యవసాయ సంస్కృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని మంత్రి కొలుసు పార్థసారథి వ్యాఖ్యానించారు.
10/12
పశువులను శాస్త్రీయ పద్ధతిలో పెంచుతూ, అత్యధిక పాల దిగుబడిని సాధిస్తున్న మేలు రకం జాతులను సంరక్షిస్తున్న రైతులకు ఈ వేడుకలో గుర్తింపు లభించింది.
11/12
ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించడం వల్ల యువతకు పాడి పరిశ్రమపై అవగాహన పెరగడమే కాకుండా, పశుపోషణలో రైతుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుందని మంత్రి కొలుసు పార్థసారథి హర్షం వ్యక్తం చేశారు.
12/12
ఈ కార్యక్రమానికి ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.
Updated at - Jan 11 , 2026 | 08:51 AM