దుర్గమ్మను దర్శించుకున్న మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్‌బీర్ దంపతులు

ABN, Publish Date - Jan 05 , 2026 | 09:33 PM

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీకనకదుర్గ అమ్మవారిని మారిషస్ దేశాధ్యక్షుడు శ్రీ ధరమ్‌బీర్ గోకుల్ దంపతులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సన్నిధానం వద్దకు ధరమ్‌బీర్ గోకుల్ దంపతులకు ఆలయ ఉన్నతాధికారులతో పాటు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది.

దుర్గమ్మను దర్శించుకున్న మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్‌బీర్ దంపతులు 1/7

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీకనకదుర్గ అమ్మవారిని మారిషస్ అధ్యక్షుడు శ్రీ ధరమ్‌బీర్ గోకుల్ దంపతులు దర్శించుకున్నారు.

దుర్గమ్మను దర్శించుకున్న మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్‌బీర్ దంపతులు 2/7

సోమవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సన్నిధానం వద్దకు ధరమ్‌బీర్ గోకుల్ దంపతులకు ఆలయ ఉన్నతాధికారులతోపాటు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది.

దుర్గమ్మను దర్శించుకున్న మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్‌బీర్ దంపతులు 3/7

అనంతరం ధరమ్‌బీర్ గోకుల్ దంపతులకు ఆలయ అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం దేవస్థాన పండితులు.. వారికి వేద ఆశీర్వచనం అందించారు.

దుర్గమ్మను దర్శించుకున్న మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్‌బీర్ దంపతులు 4/7

దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్, దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ(గాంధీ), ఆలయ కార్య నిర్వాహణాధికారి వి.కె.శీనా నాయక్ తదితరులు ధరమ్‌బీర్ గోకుల్ దంపతులకు దుర్గమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు.

దుర్గమ్మను దర్శించుకున్న మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్‌బీర్ దంపతులు 5/7

గుంటూరు వేదికగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఈ సమావేశాలను ధరమ్‌బీర్ గోకుల్ దంపతులు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో గోకుల్‌ను 'భారతమిత్ర' బిరుదుతో సత్కరించారు గజల్ శ్రీనివాస్.

దుర్గమ్మను దర్శించుకున్న మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్‌బీర్ దంపతులు 6/7

ధరమ్‌బీర్ గోకుల్‌కు భారత్‌తో 50ఏళ్ల అనుబంధం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన చరిత్ర, ఆర్థిక శాస్త్రం విభాగాల్లో విద్యనభ్యసించారు.

దుర్గమ్మను దర్శించుకున్న మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్‌బీర్ దంపతులు 7/7

ఎంపీ, మంత్రిగా పనిచేసిన ఆయన.. 2024 డిసెంబర్ 6న మారిషస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Updated at - Jan 06 , 2026 | 05:37 PM