చంద్రగ్రహణం.. జపాలు, నదీ స్నానాలు..

ABN, Publish Date - Mar 03 , 2026 | 09:09 PM

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటిలింగాల రేవు, కొవ్వూరులోని గోపాదాలరేవు వద్ద చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం జపాలను వేద పండితులు ఆచరించారు.

చంద్రగ్రహణం.. జపాలు, నదీ స్నానాలు.. 1/8

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటిలింగాల రేవు, కొవ్వూరులోని గోపాదాలరేవు వద్ద చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం జపాలను వేద పండితులు ఆచరించారు.

చంద్రగ్రహణం.. జపాలు, నదీ స్నానాలు.. 2/8

మహిళలు, చిన్నారులు గోదావరి నదీలో స్నానాలు చేశారు.

చంద్రగ్రహణం.. జపాలు, నదీ స్నానాలు.. 3/8

ఈ రోజు (03-03-2026) పాల్గుణ పౌర్ణమి. మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటలకు ఈ చంద్రగ్రహణం ప్రారంభమైంది. ఈ గ్రహణం 6.48 గంటలకు వీడింది.

చంద్రగ్రహణం.. జపాలు, నదీ స్నానాలు.. 4/8

సాయంత్రం 4.34 నుంచి 5.33 గంటల మధ్య సంపూర్ణ గ్రహణ కాలం ఉంది. భారత్‌లో సాయంత్రం 6.20 నుంచి సుమారు 27 నిమిషాల పాటు ఈ గ్రహణం కనిపించింది.

చంద్రగ్రహణం.. జపాలు, నదీ స్నానాలు.. 5/8

ఈ గ్రహణ సమయంలో రాజమహేంద్రవరం, కొవ్వూరులోని గోదావరి నదీ తీరంలో పండితులు, జప తపాలు ఆచరించారు. గ్రహణ సమయంలో భక్తితో జపం చేస్తే కొన్ని రెట్ల అధిక ఫలాన్ని ఇస్తుందని చెబుతారు.

చంద్రగ్రహణం.. జపాలు, నదీ స్నానాలు.. 6/8

ఈ గ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ దేవాలయాలను మూసివేశారు. ఈ దేవాలయాలను బుధవారం తెల్లవారుజామున తెరిచి సంప్రోక్షణ చేస్తారు.

చంద్రగ్రహణం.. జపాలు, నదీ స్నానాలు.. 7/8

అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ ఇరు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ దేవాలయాలు నిత్యం భక్తులతో కిటకిటలాడతాయి.

చంద్రగ్రహణం.. జపాలు, నదీ స్నానాలు.. 8/8

అలాంటిది చంద్రగ్రహణం కారణంగా.. ఆయా దేవాలయాలు మూసి వేశారు. దీంతో ఆ దేవాలయాల పరిసర ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి.

Updated at - Mar 03 , 2026 | 09:25 PM