విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ .. పాల్గొన్న సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Feb 18 , 2026 | 01:53 PM
విశాఖపట్నం సముద్ర తీరంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2026 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం.
1/7
విశాఖపట్నం సముద్ర తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ-2026 కార్యక్రమం అలరించింది.
2/7
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
3/7
71 యుద్ధ నౌకల నుంచి గౌరవ వందనం స్వీకరించారు రాష్ట్రపతి.
4/7
ఐఎన్‌ఎస్ సుమేధా నౌకపై రాష్ట్రపతి, గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం ప్రయాణించారు.
5/7
వివిధ దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, కోస్ట్‌గార్డ్, మర్చంట్ నేవీ, పరిశోధన నౌకలు 9 ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి.
6/7
ఆరు వరుసల్లో 71 యుద్ధ నౌకలు పరేడ్ నిర్వహించాయి.
7/7
ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. వీరితో పాటు పవన్ సతీమణి అన్నా కొణిదెల ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
Updated at - Feb 18 , 2026 | 01:57 PM