శ్రీవారి ఆలయంలో వైభవంగా ఉగాది ఆస్థానం
ABN, Publish Date - Mar 19 , 2026 | 06:23 PM
తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
1/7
ఉగాది ఉత్సవాల కోసం టీటీడీ (TTD) శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసింది.
2/7
పరాభవ నామ సంవత్సర ప్రారంభం సందర్భంగా ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గల 'బంగారు వాకిలి'లో అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం, పంచాంగ పఠనం కార్యక్రమాలను నిర్వహించారు.
3/7
సుమారు 10 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 60 వేల విదేశీ కట్ ఫ్లవర్స్‌తో ఆలయ ప్రాంగణాన్ని విశేషంగా అలంకరించారు.
4/7
మామిడాకులు, మామిడికాయలు, చెరకుగడలు, కొబ్బరి మట్టలతో తోరణాలు కట్టి, పండగ వాతావరణం ఉట్టిపడేలా ముస్తాబు చేశారు.
5/7
భక్తులను మంత్రముగ్ధులను చేసేలా ఈసారి కృత, త్రేత, ద్వాపర యుగాల ఇతివృత్తాలతో కూడిన ప్రత్యేక సెట్టింగ్‌లను ఏర్పాటు చేశారు.
6/7
పురాణకాలపు దృశ్యాలను తలపించేలా ఉన్న ఈ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
7/7
ఉగాది ఆస్థానం అనంతరం స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Updated at - Mar 19 , 2026 | 06:43 PM