జీఎన్ నాయుడు పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు, లోకేశ్ నివాళులు
ABN, Publish Date - May 02 , 2026 | 12:33 PM
పారిశ్రామిక వేత్త, రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు పార్థివ దేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని జీఎన్ నాయుడు నివాసానికి వెళ్లిన సీఎం.. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి.. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. తెలుగు ప్రజలు మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని, రీజెన్సీ స్థాపనతో యువతకు ఉపాధి కల్పనలో జీఎన్ నాయుడు కృషి ఎనలేనిదని సీఎం అన్నారు. రీజెన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేతకు ఏపీ మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని నాయుడు నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహం వద్ద మంత్రి లోకేశ్ పుష్పాంజలి ఘటించారు.
1/6
రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు నివాళులు.
2/6
రీజెన్సీ స్థాపనతో యువతకు ఉపాధి కల్పనలో జీఎన్ నాయుడు కృషి ఎనలేనిదని, సమాజ సేవకు నాయుడు తన వంతు కృషి చేశారని సీఎం చెప్పారు.
3/6
జీఎన్ నాయుడితో తనకు ఉన్న పరిచయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
4/6
డాక్టర్ జీఎన్ నాయుడికి నివాళులర్పించిన మంత్రి నారా లోకేశ్.
5/6
ఈరోజు(శనివారం) ఉదయం హైదరాబాద్‌లోని నాయుడు నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహం వద్ద మంత్రి పుష్పాంజలి ఘటించారు.
6/6
జీఎన్ నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి లోకేశ్.. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Updated at - May 02 , 2026 | 12:50 PM