హామీ నిలబెట్టుకున్నాం: సురేపల్లి సభలో సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Apr 09 , 2026 | 07:20 PM

సుపరిపాలన అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం సూరేపల్లిలో నిర్వహించిన 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో ఆయన పాల్గొని.. రైతులకు పాస్‌ పుస్తకాలు పంపిణీ చేశారు.

హామీ నిలబెట్టుకున్నాం: సురేపల్లి సభలో సీఎం చంద్రబాబు 1/10

సుపరిపాలన అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

హామీ నిలబెట్టుకున్నాం: సురేపల్లి సభలో సీఎం చంద్రబాబు 2/10

గురువారం బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం సూరేపల్లిలో నిర్వహించిన 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో ఆయన పాల్గొని.. రైతులకు పాస్‌ పుస్తకాలు పంపిణీ చేశారు.

హామీ నిలబెట్టుకున్నాం: సురేపల్లి సభలో సీఎం చంద్రబాబు 3/10

21 నెలల్లోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. ఎన్నికల్లో చెప్పనివి కూడా అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

హామీ నిలబెట్టుకున్నాం: సురేపల్లి సభలో సీఎం చంద్రబాబు 4/10

వైసీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

హామీ నిలబెట్టుకున్నాం: సురేపల్లి సభలో సీఎం చంద్రబాబు 5/10

రాష్ట్ర విభజన కంటే వైసీపీ పాలనలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

హామీ నిలబెట్టుకున్నాం: సురేపల్లి సభలో సీఎం చంద్రబాబు 6/10

వైసీపీ హయాంలో మహిళలకు రక్షణ లేదన్నారు. జగన్ పాలనలో వ్యవస్థలు గాడి తప్పాయని.. వాటిని దారిలో పెడుతున్నామన్నామని పేర్కొన్నారు.

హామీ నిలబెట్టుకున్నాం: సురేపల్లి సభలో సీఎం చంద్రబాబు 7/10

వైసీపీ హయాంలో ప్రజల భూములపై కన్నేశారని.. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో భూ వివాదాలకు తెరలేపారని మండిపడ్డారు. ‘పట్టా పుస్తకంపై జగన్ ఫొటో వేసుకున్నారు.. ఆస్తి మీది.. ఫొటో ఆయనది’ అని విమర్శించారు.

హామీ నిలబెట్టుకున్నాం: సురేపల్లి సభలో సీఎం చంద్రబాబు 8/10

ప్రజల ఆస్తులకు భద్రత ఇవ్వాలనే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.

హామీ నిలబెట్టుకున్నాం: సురేపల్లి సభలో సీఎం చంద్రబాబు 9/10

గత పాలకులు చేసిన పనులు చూసి తనకే మతిపోయిందని సీఎం అన్నారు. నూటికి 90 శాతం రెవెన్యూ సమస్యలపైనే అర్జీలు వచ్చాయన్నారు.

హామీ నిలబెట్టుకున్నాం: సురేపల్లి సభలో సీఎం చంద్రబాబు 10/10

సురేపల్లిలో జరిగిన ఈ బహిరంగ సభకు భారీగా ప్రజలు తరలి వచ్చారు.

Updated at - Apr 09 , 2026 | 07:20 PM