విజయవాడలో పాన్ ఐఐటీ ఏపీ సమ్మిట్-2026.. హాజరైన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Oct 03 , 2026 | 09:46 PM

విజయవాడలోని అంబేడ్కర్ కళావేదికలో శనివారం నిర్వహించిన పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్-2026లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

విజయవాడలో పాన్ ఐఐటీ ఏపీ సమ్మిట్-2026.. హాజరైన సీఎం చంద్రబాబు 1/11

విజయవాడలోని అంబేడ్కర్ కళావేదికలో శనివారం నిర్వహించిన పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్-2026లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

విజయవాడలో పాన్ ఐఐటీ ఏపీ సమ్మిట్-2026.. హాజరైన సీఎం చంద్రబాబు 2/11

పాన్ ఐఐటీ సమ్మిట్ జరుగుతున్న ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను సీఎం సందర్శించారు.

విజయవాడలో పాన్ ఐఐటీ ఏపీ సమ్మిట్-2026.. హాజరైన సీఎం చంద్రబాబు 3/11

ఆక్సి ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన డ్రోన్‌ను పరిశీలించారు. ఆ సంస్థ ప్రతినిధుల కోరిక మేరకు డ్రోన్‌పై సీఎం సంతకం చేశారు.

విజయవాడలో పాన్ ఐఐటీ ఏపీ సమ్మిట్-2026.. హాజరైన సీఎం చంద్రబాబు 4/11

అలాగే, వివిధ స్టార్టప్‌లు, ఐఐటీయన్ల నూతన ఆవిష్కరణలను ముఖ్యమంత్రి పరిశీలించారు.

విజయవాడలో పాన్ ఐఐటీ ఏపీ సమ్మిట్-2026.. హాజరైన సీఎం చంద్రబాబు 5/11

పెట్రోలుతో నడిచే టూవీలర్లను గంటల్లో ఈవీలుగా కన్వర్ట్ చేసే సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్‌ను సీఎం చంద్రబాబు సందర్శించారు.

విజయవాడలో పాన్ ఐఐటీ ఏపీ సమ్మిట్-2026.. హాజరైన సీఎం చంద్రబాబు 6/11

సాధారణ వాహనాలను ఈవీలుగా కన్వెర్ట్ చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.

విజయవాడలో పాన్ ఐఐటీ ఏపీ సమ్మిట్-2026.. హాజరైన సీఎం చంద్రబాబు 7/11

ముఖాన్ని స్కాన్ చేసి హెల్త్ రిపోర్టు ఇచ్చే యాప్ తయారు చేసిన సంస్థ స్టాల్‌ను కూడా సీఎం సందర్శించారు. నిమిషాల వ్యవధిలో ప్రాథమిక రిపోర్టు ఇవ్వగలమని సీఎంకు సదరు సంస్థ ప్రతినిధులు వివరించారు.

విజయవాడలో పాన్ ఐఐటీ ఏపీ సమ్మిట్-2026.. హాజరైన సీఎం చంద్రబాబు 8/11

ఈ ప్రాజెక్టును ఏపీలో ఏర్పాటు చేసేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.

విజయవాడలో పాన్ ఐఐటీ ఏపీ సమ్మిట్-2026.. హాజరైన సీఎం చంద్రబాబు 9/11

ఏపీ అభివృద్ధిలో టెక్నాలజీ వినియోగంపై స్పెషల్ ఫోకస్ పెట్టామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

విజయవాడలో పాన్ ఐఐటీ ఏపీ సమ్మిట్-2026.. హాజరైన సీఎం చంద్రబాబు 10/11

స్వర్ణాంధ్ర-10 సూత్రాల అమల్లో టెక్నాలజీ వినియోగం ద్వారా సమర్థవంతంగా అమలు చేసే అంశంపై తమ ఐడియాలను ముఖ్యమంత్రికి వివరిస్తూ చిన్నారులు ప్రజెంటేషన్ చేశారు.

విజయవాడలో పాన్ ఐఐటీ ఏపీ సమ్మిట్-2026.. హాజరైన సీఎం చంద్రబాబు 11/11

ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్యమంత్రి అభినందించారు. చిన్నారులతో కలిసి సీఎం చంద్రబాబు గ్రూప్ ఫొటో దిగారు.

Updated at - Oct 03 , 2026 | 09:57 PM