సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
ABN, Publish Date - Nov 11 , 2026 | 04:29 PM
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలపై సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం రాజధాని అమరావతిలో సమీక్షించారు. ఎత్తిపోతల పథకాల మరమ్మతులు, నిర్వహణ, ఇరిగేషన్ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించారు.
1/4

2/4
సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టులను జలహారతి కార్పొరేషన్ ద్వారా పర్యవేక్షించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తరహాలో వాటర్ రెగ్యులేటరీ కమిషన్ తీసుకొచ్చే అంశంపై అధ్యయనం చేయాలని వారికి సీఎం సూచించారు.
3/4
రెండున్నర ఏళ్లలో ప్రభుత్వం నిర్దేశించుకున్న 36 ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
4/4
స్వాతంత్య్ర సమరయోధులు, కేంద్ర తొలి విద్యా శాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నేడు. ఈ సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
Updated at - Nov 11 , 2026 | 05:02 PM