విశాఖలో సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌-2026కు సర్వం సిద్ధం

ABN, Publish Date - Nov 11 , 2026 | 10:46 AM

విశాఖ మరోసారి అంతర్జాతీయ వేదికగా మారనుంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ మైదానంలో నవంబర్ 12, 13వ తేదీల్లో సాగర తీరాన నిర్వహించే సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్-2026కు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సదస్సుకు ప్రపంచ నలుమూలల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు రానున్నారు. సింగపూర్, యూఏఈ, జపాన్, రష్యా, స్లోవేకియా, గ్వాటెమాల ప్రతినిధులు సీఐఐ సదస్సులో భాగస్వామ్యంకానున్నారు. ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా చేపడుతున్న ఈ సదస్సును రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. నేడు విదేశీ ప్రతినిధులు, పరిశ్రమల అధినేతలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశంకానున్నారు.

Updated at - Nov 11 , 2026 | 11:23 AM