కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూలు చేసుకున్న కంపెనీలు

ABN, Publish Date - Feb 01 , 2026 | 01:29 PM

రాష్ట్రంలో ఒప్పందం చేసుకున్న ప్రతీ ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎంఓయూ చేసుకుంటే అది ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి వేగంగా పూర్తి అయ్యేందుకు సహకరిస్తామని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలోనే అనుమతులు మంజూరు చేసి ప్రాజెక్టు సాకారమయ్యేలా చూస్తామని పారిశ్రామిక వేత్తలకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.

కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూలు చేసుకున్న కంపెనీలు 1/6

రాష్ట్రంలో ఒప్పందం చేసుకున్న ప్రతీ ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూలు చేసుకున్న కంపెనీలు 2/6

ఎంఓయూ చేసుకుంటే అది ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి వేగంగా పూర్తి అయ్యేందుకు సహకరిస్తామని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలోనే అనుమతులు మంజూరు చేసి ప్రాజెక్టు సాకారమయ్యేలా చూస్తామని పారిశ్రామిక వేత్తలకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.

కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూలు చేసుకున్న కంపెనీలు 3/6

శనివారం కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోని పరిశ్రమల పురోగతిపై సీఎం సమీక్షించారు. యూనిట్‌లను ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక వేత్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. కుప్పంలో కొత్త పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న పరిశ్రమల పురోగతి తదితర అంశాల గురించి చర్చించారు.

కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూలు చేసుకున్న కంపెనీలు 4/6

సరైన సమయంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తేనే అందరికీ ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు ఆలస్యమైతే అందరికీ నష్టమేనని.. పెట్టుబడి వ్యయం పెరగటంతో పాటు వయబిలిటీ అంశంలోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.

కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూలు చేసుకున్న కంపెనీలు 5/6

నిర్దేశిత గడువులోపు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని పారిశ్రామిక వేత్తలకు సీఎం చంద్రబాబు సూచించారు.

కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూలు చేసుకున్న కంపెనీలు 6/6

కుప్పంలో రూ. 7,684 కోట్ల విలువైన పెట్టుబడులతో 21 పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయని ఆయన ప్రకటించారు. వీటి ద్వారా 35,545 మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా మరో 44,584 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు.

Updated at - Feb 01 , 2026 | 01:30 PM