ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పోలవరం ఎడమ కాలువ ద్వారా విడుదల

ABN, Publish Date - Sep 02 , 2026 | 06:19 PM

ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పర్యటించారు. ఏరియల్‌ వ్యూ ద్వారా పోలవరం ఎడమ కాలువను పరిశీలించిన అనంతరం ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేశారు.

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పోలవరం ఎడమ కాలువ ద్వారా విడుదల 1/6

పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పోలవరం ఎడమ కాలువ ద్వారా విడుదల 2/6

ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సంప్రదాయ కోలాట ప్రదర్శనతో ఆయనను ఆహ్వానించారు.

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పోలవరం ఎడమ కాలువ ద్వారా విడుదల 3/6

సీఎం చంద్రబాబు గోదావరి జలాలకు హారతి ఇచ్చి, పవిత్ర జలాలను తలపై చల్లుకున్నారు. అనంతరం నేలపై సాష్టాంగ నమస్కారం చేసి.. ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరినందుకు ఆనందం వ్యక్తం చేశారు.

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పోలవరం ఎడమ కాలువ ద్వారా విడుదల 4/6

ఎడమ కాల్వ ద్వారా వదిలే నీటితో నాలుగు జిల్లాల పరిధిలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళిక రచించింది.

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పోలవరం ఎడమ కాలువ ద్వారా విడుదల 5/6

ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పోలవరం ఎడమ కాలువ ద్వారా విడుదల 6/6

చంద్రబాబును చూసి నేతలు, రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

Updated at - Sep 02 , 2026 | 06:33 PM