విశాఖ ఆర్‌కే బీచ్‌లో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం

ABN, Publish Date - Sep 19 , 2026 | 09:46 PM

విశాఖ ఆర్‌కే బీచ్‌లో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు.

విశాఖ ఆర్‌కే బీచ్‌లో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’  కార్యక్రమం 1/6

విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌లో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సాగర స్వచ్ఛత కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఎం.. బీచ్‌లో జరుగుతున్న శుభ్రత పనులను పరిశీలించారు.

విశాఖ ఆర్‌కే బీచ్‌లో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’  కార్యక్రమం 2/6

సముద్ర వ్యర్థాలను సేకరిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులు, స్కూబా డైవర్లతో సీఎం ముఖాముఖిగా మాట్లాడారు. చేపల వేటతో పాటు సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం ద్వారా లభిస్తున్న ప్రోత్సాహకాలతో తమకు అదనపు ఆదాయం వస్తోందని మత్స్యకారులు తెలిపారు.

విశాఖ ఆర్‌కే బీచ్‌లో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’  కార్యక్రమం 3/6

మ్యాన్‌హోళ్లు, మురుగు కాల్వల శుభ్రత కోసం జీవీఎంసీ అందుబాటులోకి తెచ్చిన ఆధునిక సీవరేజ్ రోబో పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు.

విశాఖ ఆర్‌కే బీచ్‌లో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’  కార్యక్రమం 4/6

అలాగే జీవీఎంసీ సాగర స్వచ్ఛత ప్రాజెక్టుకు లభించిన గ్లోబల్ గుర్తింపు, భవిష్యత్తు లక్ష్యాలపై బ్లూమ్‌బెర్గ్ ప్రతినిధులతో సీఎం చర్చించారు.

విశాఖ ఆర్‌కే బీచ్‌లో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’  కార్యక్రమం 5/6

సాగర తీరంలో మురి మిక్చర్‌ విక్రయిస్తున్న మహిళతో చంద్రబాబు మాట్లాడారు. ఆమె జీవనోపాధి, వ్యాపారం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విక్రయిస్తున్న మురి మిక్చర్‌ను సీఎం ఆస్వాదించారు.

విశాఖ ఆర్‌కే బీచ్‌లో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’  కార్యక్రమం 6/6

మురి మిక్చర్‌ విక్రయించే మహిళ ఒంటరి మహిళ అని తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆమెకు పెన్షన్‌ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

Updated at - Sep 19 , 2026 | 09:46 PM