నీటిని సంరక్షించు కోవడానికి యాక్షన్ ప్లాన్: సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Apr 06 , 2026 | 06:56 PM
అనంతపురం జిల్లా యాడికిలో సీఎం చంద్రబాబు సోమవారం పర్యటించారు. యాడికిలో ఏర్పాటు చేసిన నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సాగునీటి సంఘాలు, రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. నీటిని సంరక్షించుకోడానికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టామని తెలిపారు.
1/12
అనంతపురం జిల్లా యాడికిలో సీఎం చంద్రబాబు సోమవారం పర్యటించారు.
2/12
యాడికిలో ఏర్పాటు చేసిన నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సాగునీటి సంఘాలు, రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.
3/12
నీటిని సంరక్షించుకోడానికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టామని తెలిపారు.
4/12
పరిగెత్తే నీటిని నిలబెట్టాలి.. నిలబడిన నీటిని నిల్వ చేయాలి.. జలాశయాలు నింపేందుకు ప్రయత్నించాలని సాగునీటి సంఘాలు, రైతులకు వివరించారు.
5/12
అలాగే గతంలో నీటి సంరక్షణ కోసం తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలను సీఎం వివరించారు.
6/12
అనంతపురంలో భూగర్భ జలాల నీటిని పెంచడం కోసం చేపట్టిన చర్యలను సైతం గుర్తు చేశారు.
7/12
నీటి భద్రతా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా రైతులు, సాగునీటి సంఘాలకు విజ్ఞప్తి చేశారు.
8/12
మైక్రో ఇరిగేషన్‌లో తాము చేసిందే.. దేశం మొత్తం అనుసరించిందన్నారు. ప్రస్తుతం మైక్రో ఇరిగేషన్‌లో రూ.1,031 కోట్లు ఖర్చు చేస్తూ దేశంలో రాష్ట్రం నెంబర్ వన్‌గా ఉందని తెలిపారు
9/12
డ్రిప్ ఇరిగేషన్ వల్లే రాయలసీమ హార్టికల్చర్ హబ్‌గా మారిందని చెప్పారు. హార్టికల్చర్‌లో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
10/12
ఏపీకి రాజధాని అమరావతి ఏకైక రాజధాని అని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిందని గుర్తు చేశారు.
11/12
అలాగే జగన్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న సంఘటనలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సోదాహరణగా వివరించారు.
12/12
వైసీపీ నేతల చర్యలను ఆయన ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు మంత్రులతోపాటు నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.
Updated at - Apr 06 , 2026 | 06:59 PM