అమరావతిలో డిన్నర్ విత్ ది రియల్ విన్నర్ విందు
ABN, Publish Date - May 01 , 2026 | 08:48 PM
‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025’ అవార్డు అందుకున్నందుకు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హెచ్‌వోడీలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆత్మీయ విందు ఇచ్చారు. అలాగే వివిధ శాఖల్లో చక్కటి పనితీరు కనబరచిన జిల్లా, మండల స్థాయి ఉద్యోగులనూ విందుకు ఆహ్వానించారు.
1/12
‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025’ అవార్డు అందుకున్నందుకు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హెచ్‌వోడీలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆత్మీయ విందు ఇచ్చారు. అలాగే వివిధ శాఖల్లో చక్కటి పనితీరు కనబరచిన జిల్లా, మండల స్థాయి ఉద్యోగులనూ విందుకు ఆహ్వానించారు.
2/12
డిన్నర్ విత్ ది రియల్ విన్నర్ పేరుతో గురువారం అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు.
3/12
ఈ డిన్నర్‌కు ముందు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు.
4/12
ఈ సమావేశం ప్రారంభం కాగానే మంత్రులు, అధికారులు, ఉద్యోగులు చప్పట్లతో సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికారు.
5/12
ఈ కార్యక్రమానికి మంత్రి పయ్యావుల కేశవ్ సమన్వయ కర్తగా వ్యవహరించారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడానికి టీమ్ ఏపీ పని తీరే కారణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
6/12
మంత్రులు, అధికారులు, ఉద్యోగులే రియల్ విన్నర్స్ అని చెప్పారు. రాష్ట్ర విభజన, గత ప్రభుత్వంలో జరిగిన పరిణామాలను సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు. సంస్కరణలనేవి చంద్రబాబు డీఎన్‌ఏలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
7/12
విద్యుత్, ఓపెన్ స్కై పాలసీ, టెలికాం రంగం, ఐటీ, డ్రిప్ ఇరిగేషన్, పీపీపీ వంటి రంగాలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే సంస్కరణలు తెచ్చారన్నారు.
8/12
రానున్న రోజుల్లో ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, చేరుకోవాల్సిన లక్ష్యాలు, అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై ఈ సమావేశంలో చర్చించారు.
9/12
ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు పనితీరును మంత్రి నారా లోకేశ్ వివరించారు.
10/12
ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేసేందుకు మంత్రులు, అధికారుల వెంటపడి టాస్క్ పూర్తి చేయించే విధానాన్ని లోకేశ్ వివరించారు.
11/12
పరిపానలోనూ, రాజకీయాల్లోనూ ఎలాంటి ఇగోలకు పోకుండా పనిచేసే వ్యక్తి చంద్రబాబు అని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు.
12/12
పెట్టుబడులను తీసుకొచ్చే విషయంలో పారిశ్రామిక వేత్తలను కలిసే విషయంలో ఇగోలను పక్కన పెట్టి టీమ్ స్ఫూర్తితో పని చేస్తు్న్నామని లోకేశ్ వివరించారు.
Updated at - May 01 , 2026 | 08:51 PM