క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో మంత్రి లోకేష్ భేటీ

ABN, Publish Date - Mar 12 , 2026 | 11:54 AM

క్యాప్ జెమిని సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చ జరిగింది.

క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో మంత్రి లోకేష్ భేటీ 1/5

క్యాప్ జెమిని సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చ జరిగింది.

క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో మంత్రి లోకేష్ భేటీ 2/5

విశాఖలో 20వేల ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం గల ఐటీ డెవలప్ సెంటర్, జీసీసీ, క్లౌడ్ సర్వీసెస్, బీపిఎం వర్టికల్స్ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు.

క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో మంత్రి లోకేష్ భేటీ 3/5

ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్స్ (ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ అభివృద్ధి, డిజిటల్ టాలెంట్ పైప్ లైన్) ఏర్పాటు కోసం ఏపీ విశ్వవిద్యాలయాలతో కలిసి కో డెవలప్‌మెంట్ పార్టనర్‌గా వ్యవహరించాలని అభ్యర్థించారు.

క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో మంత్రి లోకేష్ భేటీ 4/5

ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటం వ్యాలీ అభివృద్ధికి సహకారం అందించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఐమాన్ ఇజ్జత్ చెప్పారు.

క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో మంత్రి లోకేష్ భేటీ 5/5

ఈ సమావేశంలో క్యాప్ జెమినీ ఇండియా సీఈవో సంజయ్ చాకే, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సీఈవో కేశవ్ మురుగేష్ పాల్గొన్నారు. (క్యాప్ జెమినీ సంస్థ $23.9 బిలియన్ల వార్షికాదాయం సాధిస్తోంది.).

Updated at - Mar 12 , 2026 | 11:55 AM