ఏపీకి బిల్ గేట్స్.. ఘన స్వాగతం
ABN, Publish Date - Feb 16 , 2026 | 10:56 AM
గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఏపీకి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో బిల్ గేట్స్ బృందానికి మంత్రి లోకేశ్, మంత్రులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. స్వయంగా కారు వద్దకు వెళ్లి ఆహ్వానించారు. బిల్ గేట్స్‌తో పాటు ఆయన ప్రతినిధి బృందం సభ్యులు మైఖేల్ థియోడార్ జాయోగృలస్, క్రిస్టియాన మరియా ఇస్కుందర్, అంకుర్ చంద్రకాంత్ ఓరా, అర్చన వ్యాస్‌లు సచివాలయానికి చేరుకున్నారు.
1/6
ఏపీకి చేరుకున్న బిల్ గేట్స్.
2/6
గన్నవరం ఎయిర్‌పోర్టులో బిల్ గేట్స్‌కు స్వాగతం పలికిన మంత్రి లోకేశ్, మంత్రులు.
3/6
అమరావతి సచివాలయానికి బిల్ గేట్స్, గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు.
4/6
గేట్స్ బృందానికి మొదటి బ్లాక్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు స్వాగతం పలికారు.
5/6
బిల్ గేట్స్‌తో పాటు ప్రతినిధి బృందం సభ్యులు మైఖేల్ థియోడార్ జాయోగృలస్, క్రిస్టియాన మరియా ఇస్కుందర్, అంకుర్ చంద్రకాంత్ ఓరా, అర్చన వ్యాస్‌లు సచివాలయానికి చేరుకున్నారు.
6/6
బిల్ గేట్స్‌కు మంత్రులను పరిచయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
Updated at - Feb 16 , 2026 | 11:15 AM