ఆత్రేయపురం ఉత్సవాల్లో డ్రాగన్ పడవ పోటీలు
ABN, Publish Date - Jan 12 , 2026 | 09:06 PM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. జిల్లాలోని ఆత్రేయపురం మండలం తాడిపూడి వద్ద సంక్రాంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఈత, ముగ్గు పోటీలను నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో రెండో రోజు అంటే సోమవారం పడవ పోటీలు నిర్వహించారు.
1/10
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.
2/10
జిల్లాలోని ఆత్రేయపురం మండలం తాడిపూడి వద్ద సంక్రాంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
3/10
తొలిరోజు అంటే నిన్న ఈత, ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో రెండో రోజు అంటే ఈ రోజు (సోమవారం) పడవ పోటీలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతోపాటు పలువురు ఉన్నతాధికారులు ఈ పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు.
4/10
ఈ పోటీలకు తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన మొత్తం 28 బృందాల జట్లు పాల్గొన్నాయి. ఈ ఉత్సవాలు రేపటితో అంటే మంగళవారంతో ముగియనున్నాయి.
5/10
ఆత్రేయపురం వేదికగా కేరళ తరహా పడవ పోటీలు నిర్వహించడం పట్ల నిర్వాహకులతోపాటు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
6/10
పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయని స్థానికులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
7/10
ఈ డ్రాగన్ పడవల పోటీలు మంగళవారం కూడా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా లొల్ల లాకుల వద్ద ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు.
8/10
ఈ ఉత్సవాల జరుగుతున్న మూడు రోజులు సాయంత్రం వేళ .. స్థానిక మహాత్మాగాంధీ కళాశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
9/10
కోనసీమ రుచులతో కూడిన ఫుడ్ ఫెస్టివల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్వాహకులు వెల్లడించారు. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 250 మంది వచ్చారు.
10/10
మంగళవారం ఈ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీని విజేతలకు అందజేయనున్నారు.
Updated at - Jan 12 , 2026 | 09:15 PM