నర్సరావుపేటలో మంత్రి లోకేశ్ పర్యటన

ABN, Publish Date - Sep 02 , 2026 | 05:04 PM

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం పల్నాడు జిల్లాలోని నర్సరావుపేటలో పర్యటించారు. నర్సరావుపేట మండలం కాకాని గ్రామంలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ(JNTUK) యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినీ, విద్యార్థులకు గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో నూతనంగా నిర్మించిన మూడు హాస్టల్ భవనాలను మంత్రి ప్రారంభించారు.

నర్సరావుపేటలో మంత్రి లోకేశ్ పర్యటన 1/11

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం పల్నాడు జిల్లాలోని నర్సరావుపేటలో పర్యటించారు.

నర్సరావుపేటలో మంత్రి లోకేశ్ పర్యటన 2/11

నర్సరావుపేట మండలం కాకాని గ్రామంలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ(JNTUK) యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినీ, విద్యార్థులకు గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో నూతనంగా నిర్మించిన మూడు హాస్టల్ భవనాలను మంత్రి లోకేశ్ ప్రారంభించారు.

నర్సరావుపేటలో మంత్రి లోకేశ్ పర్యటన 3/11

విద్యార్థినీ, విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ భవనాలను అత్యాధునిక సదుపాయాలతో ఏపీ ప్రభుత్వం నిర్మించింది.

నర్సరావుపేటలో మంత్రి లోకేశ్ పర్యటన 4/11

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి లోకేశ్ ఆవిష్కరించారు. ముందుగా కళాశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రికి కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు.

నర్సరావుపేటలో మంత్రి లోకేశ్ పర్యటన 5/11

అనంతరం రూ.70 కోట్ల వ్యయంతో 1,600 మంది విద్యార్థినీ, విద్యార్థులకు అత్యాధునిక వసతులతో నిర్మించిన నూతన వసతి గృహాలను మంత్రి లోకేశ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

నర్సరావుపేటలో మంత్రి లోకేశ్ పర్యటన 6/11

ఆ తర్వాత హాస్టల్ మొత్తం కలియతిరిగి వసతులను మంత్రి లోకేశ్ పరిశీలించారు.

నర్సరావుపేటలో మంత్రి లోకేశ్ పర్యటన 7/11

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ వి.సంజనా సిమ్హా, జేఎన్ టీయూకే వైస్ ఛాన్స్‌లర్ సీఎస్ఆర్కే ప్రసాద్, రాజ్యసభ ఎంపీ భాష్యం రామకృష్ణ, మంత్రి గొట్టిపాటి రవికుమార్, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు చదలవాడ అరవిందబాబు, జీవీ ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, భాష్యం ప్రవీణ్, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ బీటీ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నర్సరావుపేటలో మంత్రి లోకేశ్ పర్యటన 8/11

గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో నిర్మించిన ఈ మూడు హాస్టల్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.70 కోట్లను ఖర్చు చేసింది.

నర్సరావుపేటలో మంత్రి లోకేశ్ పర్యటన 9/11

మొత్తం 1,600 మంది విద్యార్థినీ, విద్యార్థులకు వసతి కల్పించేలా హాస్టళ్లను ప్రభుత్వం రూపొందించింది.

నర్సరావుపేటలో మంత్రి లోకేశ్ పర్యటన 10/11

విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా నిర్మించిన గదులు, ఇతర మౌలిక సదుపాయాలపై మంత్రి లోకేశ్.. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నర్సరావుపేటలో మంత్రి లోకేశ్ పర్యటన 11/11

నర్సరావుపేట జేఎన్‌టీయూకే కాలేజీలో నూతన హాస్టళ్ల ప్రారంభంతో విద్యార్థులకు వసతి సమస్యలు మరింత తగ్గనున్నాయని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు.

Updated at - Sep 02 , 2026 | 06:40 PM