ఏపీలో తొలి విడత 3,240 పంచాయతీలకు పోలింగ్.. సర్వం సిద్ధం..
ABN, Publish Date - Nov 25 , 2026 | 09:39 PM
రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం 26 జిల్లాల్లోని 3,240 పంచాయతీలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
1/12
రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం 26 జిల్లాల్లోని 3,240 పంచాయతీలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
2/12
మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.. ఫలితాలను ప్రకటించనున్నారు.
3/12
ఇక ఏకగ్రీవాలు మినహా 3,240 పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.
4/12
ఇప్పటికే తొలివిడతలో 709 పంచాయతీలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే.
5/12
తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 31,614 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
6/12
తొలివిడత ఎన్నికల్లో 74.45 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
7/12
విశాఖపట్నం, గుంటూరు జిల్లాలు మినహా ఇతర జిల్లాల్లో ఈ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నిర్వహించనుంది.
8/12
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,167 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో.. 26 నవంబర్, 29 నవంబర్, 02 డిసెంబర్ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
9/12
ఇక తుది దశ స్థానిక సంస్థలు నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీ/ నగర పంచాయతీలకు కూడా గురువారం ఎన్నికల పోలింగ్ జరగనుంది. వీటి ఫలితాలు నవంబర్ 30న ప్రకటిస్తారు.
10/12
రాష్ట్రంలో మొత్తం 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి.
11/12
తొలి దశలో 100 సంస్థలకు ఎన్నికలు జరిగాయి. తుది దశలో రేపు(గురువారం) 23 సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.
12/12
ఈ ఎన్నికల్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
Updated at - Nov 25 , 2026 | 09:48 PM