విజయవాడలో యోగా దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Jun 21 , 2026 | 09:55 AM

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

విజయవాడలో యోగా దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 1/20

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

విజయవాడలో యోగా దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 2/20

యోగాంధ్ర లోగోతో కూడిన ప్రత్యేక టీ షర్ట్‌ని సీఎం ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విజయవాడలో యోగా దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 3/20

వేలాది మంది యోగా సాధకులతో కలిసి ముఖ్యమంత్రి యోగా అభ్యాసం చేశారు.

విజయవాడలో యోగా దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 4/20

ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనులోమ - విలోమ పద్ధతిలో ప్రాణాయామం చేశారు.

విజయవాడలో యోగా దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 5/20

రామ్‌దేవ్ బాబా స్వయంగా సీఎంతో ప్రాణాయామ సాధన చేయించడంతో ఈ కార్యక్రమం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

విజయవాడలో యోగా దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 6/20

ఈ వేదికపై రామ్‌దేవ్ బాబా శిష్యులు వివిధ యోగాసనాలను ప్రదర్శించి యోగా సాధకులను ఆకట్టుకున్నారు.

విజయవాడలో యోగా దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 7/20

యోగ సాధన వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించడంతో పాటు, నిత్యజీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని రామ్‌దేవ్ బాబా సూచించారు.

విజయవాడలో యోగా దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 8/20

ఈ కార్యక్రమం ప్రారంభంలో వేంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామస్మరణ మధ్య ఈ స్టేడియం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

విజయవాడలో యోగా దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 9/20

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు యోగా సాధన చేసి ఆరోగ్యకర జీవనశైలికి యోగా ఎంత ముఖ్యమో ప్రజలకు వివరించారు.

విజయవాడలో యోగా దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 10/20

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించేలా సాగింది.

విజయవాడలో యోగా దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 11/20

ఈ వేడుకల్లో కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఏపీ మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు పాల్గొని యోగా సాధన చేశారు.

విజయవాడలో యోగా దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 12/20

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

విజయవాడలో యోగా దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 13/20

ప్రశాంత వాతావరణంలో యోగా గురువు రామ్‌దేవ్ బాబాతో కలిసి యోగాభ్యాసం చేయడం ఎన్నటికీ మరువలేనని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

విజయవాడలో యోగా దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 14/20

యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి.. సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

విజయవాడలో యోగా దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 15/20

ప్రధాని మోదీ ప్రపంచానికి భారతదేశ శక్తిని చాటుతున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. దేశాన్ని అగ్రభాగాన నిలుపుతున్నారని ప్రశంసించారు.

విజయవాడలో యోగా దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 16/20

ప్రధాని మోదీ చొరవతో 190 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు.

విజయవాడలో యోగా దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 17/20

ప్రపంచానికి భారత్ విశ్వగురు... ప్రపంచానికి మార్గనిర్దేశం చేయగలిగేది భారతదేశమని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

విజయవాడలో యోగా దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 18/20

ఫిజికల్, మెంటల్ ఫిట్‌నెస్ పెంచేది యోగానే అని సీఎం చంద్రబాబు వివరించారు. యోగాను ప్రజలకు దగ్గర చేసిన రామ్‌దేవ్ బాబా కృషి అమోఘమని ప్రశంసించారు.

విజయవాడలో యోగా దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 19/20

సాంకేతికత, ఆధ్యాత్మికత కాంబినేషన్‌తో వెళ్తేనే భవిష్యత్తు ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆధ్యాత్మికత, యోగా సాధనతో హెల్తీ, వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యమని ఉద్ఘాటించారు.

విజయవాడలో యోగా దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు 20/20

ఆధ్యాత్మికాంధ్రప్రదేశ్ సాధించేందుకు కృషి చేద్దామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో యోగాంధ్ర-2025 నిర్వహించి రికార్డులు సృష్టించామని తెలిపారు.

Updated at - Jun 21 , 2026 | 11:41 AM