విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్.. హాజరైన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - May 26 , 2026 | 06:50 AM
విజయవాడలో కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో సోమవారం ‘ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్-2026’ నిర్వహించారు. ఈ సమ్మిట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై ప్రసంగించారు.
1/13
విజయవాడలో కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో సోమవారం ‘ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్-2026’ నిర్వహించారు. ఈ సమ్మిట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై ప్రసంగించారు.
2/13
యువత కలలను నిజం చేసే బాధ్యతను తాము తీసుకుంటామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పెద్దలు, టీనేజర్లు, జెన్-ఆల్ఫా, జెన్-జీ... ఇలా తరానికి, తరానికి ఆలోచనలు పూర్తిగా మారిపోతున్నాయని వివరించారు.
3/13
యువత ఆశయాలేంటి? , ఏవిధంగా చదువుకుంటారో చెప్పాలని.. తమ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని యువతకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు.
4/13
దేశ ఆర్థిక రంగానికి ఎంఎస్ఎంఈలే వెన్నెముఖ అని సీఎం వ్యాఖ్యానించారు.
5/13
యువత కలల సాకారానికి ఎంఎస్ఎంఈ రంగమే సరైన వేదిక అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
6/13
ప్రస్తుతం రాష్ట్రంలో 20.77 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయని వెల్లడించారు. అయితే రాష్ట్రంలో 1.30 కోట్ల కుటుంబాలున్నాయని, రాష్ట్రంలో ఒక కోటి ఎంఎస్ఎంఈ యూనిట్లు ప్రారంభించాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు.
7/13
పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవేస్, రైల్వేస్ ద్వారా లాజిస్టిక్స్, అవసరమైన నీరు, కరెంట్... ఇలా అన్ని సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. ఓ చిన్న ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే అవకాశం ఎంఎస్ఎంఈలకు మాత్రమే ఉందని సీఎం వివరించారు.
8/13
‘వన్ ఫ్యామిలీ - వన్ ఎంటర్ ప్రెన్యూర్’ లక్ష్యం తప్పకుండా జరిగి తీరుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల ఎంఎస్ఎంఈల ద్వారా తయారైన ఉత్పత్తులు ప్రపంచ విపణికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు.
9/13
ఏపీలో ఎంఎస్ఎంఈ, ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ పాలసీ, ప్రైవేటు పారిశ్రామిక పార్కుల పాలసీలను తీసుకువచ్చి.. ఈ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కేవలం 23 నెలల్లో రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి.. 23 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
10/13
ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలని సీఎం సూచించారు. ఈ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ సరికొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలవాలని పిలుపునిచ్చారు.
11/13
పారిశ్రామిక యూనిట్లను పెద్దఎత్తున ఏర్పాటు చేసే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఒక ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కు చొప్పున 175 ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే 100 పార్కులకు శంకుస్థాపనలు చేయగా.. 19 పార్కులకు ప్రారంభోత్సవాలు చేశామని సీఎం పేర్కొన్నారు.
12/13
ఇవాళ మరో 38 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపనలు చేశామని సీఎం ప్రస్తావించారు. ఈ 138 పారిశ్రామిక పార్కులు సిద్ధమవ్వగా, మిగిలిన వాటిని జూలై నాటికి శంకుస్థాపనలు చేసి అన్ని మౌలిక వసతులను కల్పిస్తామని అన్నారు. ఈ పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులకు కూడా న్యాయం చేయాలని పేర్కొన్నారు.
13/13
మెటా, అమెజాన్, జోహో లాంటి సంస్థలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు యువత భవిష్యత్తుకు, ఉపాధికి, నైపుణ్యాలకు కొత్త దారులను సృష్టిస్తాయని చెప్పుకొచ్చారు. మారుతున్న టెక్నాలజీ.. ఉద్యోగాల స్వరూపాలకు అనుగుణంగా టెక్నాలజీ స్కిల్ బిజినెస్ ఇంటిగ్రేషన్ మోడల్‌ను అనుసరిస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Updated at - May 26 , 2026 | 06:56 AM