విశాఖపట్నంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Sep 20 , 2026 | 08:35 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా పేదలకు ఇళ్ల పట్టాలను సీఎం పంపిణీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై లబ్ధిదారులకు పట్టాలు అందించి వారితో ఫొటో దిగారు.
1/15
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విశాఖపట్నంలో పర్యటించారు.
2/15
ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో పేదలకు ఇళ్ల పట్టాలను సీఎం పంపిణీ చేశారు.
3/15
విశాఖలో ఏర్పాటు చేసిన వేదికపై లబ్దిదారులకు పట్టాలు అందించి వారితో సీఎం ఫొటో దిగారు.
4/15
28,445 కుటుంబాలు నివసించే ఇళ్లపై హక్కులు కల్పిస్తూ పట్టాలను ముఖ్యమంత్రి మంజూరు చేశారు.
5/15
విశాఖపట్నంలో ఇళ్ల పట్టాల పంపిణీకి భారీగా హాజరైన ప్రజలు
6/15
అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయ స్వామి, అచ్చెన్నాయుడు, నారాయణ, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ భరత్, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
7/15
అనంతరం విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.
8/15
సాగర స్వచ్ఛత కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సీఎం చంద్రబాబు పరిశీలించారు. పెదజాలరిపేటలో ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ పైలట్ సైట్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు.
9/15
సముద్ర వ్యర్ధాలను సేకరించే పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులు, స్కూబా డైవర్లతో సీఎం ముఖాముఖి నిర్వహించారు.
10/15
సాగర స్వచ్ఛతలో భాగంగా ఏకంగా 1,200 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎంకు.. అధికారులు వివరించారు.
11/15
మ్యాన్‌హోళ్లు, మురుగు కాల్వల శుభ్రత కోసం జీవీఎంసీ అందుబాటులోకి తీసుకువచ్చిన ఆధునిక సీవరేజ్ రోబో పనితీరును ప్రదర్శనశాలలో ముఖ్యమంత్రి పరిశీలించారు.
12/15
ఆర్కే బీచ్‌లో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సాగర తీరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు బీచ్‌లో స్వయంగా చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
13/15
సాగర తీరంలో మురి మిక్చర్ విక్రయించే మహిళ స్టాల్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఆమె జీవనోపాధి గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.
14/15
సాగర తీరంలో మురిమిక్చర్‌ను సీఎం చంద్రబాబు ఆస్వాదించారు.
15/15
విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఎంపీ శ్రీభరత్, గంటా శ్రీనివాసరావు స్వాగతం పలికారు.
Updated at - Sep 20 , 2026 | 09:12 AM