నెల్లూరులో ఆంధ్రజ్యోతి మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో
ABN, Publish Date - Mar 19 , 2026 | 06:37 PM
ఆంధ్రజ్యోతి, ఐఆర్ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్), టర్కీ ఈవెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నుంచి నెల్లూరులో ఎడ్యుకేషన్ ఎక్స్‌పో జరిగింది. నగరంలోని మినీ బైపాస్ రోడ్డు, అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఉన్న పీవీఆర్ కల్యాణ మండపంలో ఉదయం 10:30 నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహిస్తున్నారు.
1/9
ఆంధ్రజ్యోతి, ఐఆర్ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్), టర్కీ ఈవెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నుంచి నెల్లూరులో ఎడ్యుకేషన్ ఎక్స్‌పో జరిగింది.
2/9
నగరంలోని మినీ బైపాస్ రోడ్డు, అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఉన్న పీవీఆర్ కల్యాణ మండపంలో ఉదయం 10:30 నుంచి రాత్రి 7:00 గంటల వరకు నిర్వహిస్తున్నారు.
3/9
ఈ ఎక్స్‌పోలో దేశంలోని 40కి పైగా ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, కన్సల్టెన్సీ ఏజెన్సీలు, శిక్షణా సంస్థలు పాల్గొంటున్నాయి.
4/9
విద్యార్థులు తమ భవిష్యత్తుకు ఉన్నత మార్గాలను అన్వేషించడం కోసం, కెరీర్ ప్లానింగ్ అవకాశం కల్పిస్తున్నారు. శుక్రవారం కూడా ఈ ఎక్స్‌పో కొనసాగనుంది.
5/9
ఇంటర్ లేదా ప్రి డిగ్రీ తర్వాత ఏ కోర్సు చేయాలనే సందిగ్ధంలో ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ఎక్స్‌పోను సందర్శిస్తే తగిన అవగాహన కలుగుతుంది. ఆయా విద్యాసంస్థల్లో అందుబాటులో ఉన్న కోర్సులు, వాటి కాలవ్యవధి, వాటి ఫీజుల వివరాలతో పాటు విదేశీ విద్యకు సంబంధించిన సమాచారం కూడా తెలుసుకునే వీలుంటుంది.
6/9
ఏ కోర్సు తీసుకోవాలో, ఏది బెస్ట్ కాలేజీనో.. ఉన్నత శిఖరాలకు ఏది ఉత్తమమైన కోర్సు? వంటి ఎన్నో వివరాలు పొందేందుకు విద్యార్థులకు ఇదోో సువర్ణావకాశం. అలాగే ప్రవేశ పరీక్షలు, కళాశాలల అడ్మిషన్లు, కెరీర్ సూచికలకు నిపుణులు దిశానిర్దేశం చేస్తారు.
7/9
ఇంటర్, ప్రీ డిగ్రీ విద్యార్థులే కాకుండా ఉన్నత విద్య అభ్యసించాలని ఆకాంక్షించే ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
8/9
అన్ని ప్రవేశ పరీక్షలకు సంబంధించి వెబ్ కౌన్సెలింగ్‌కు నిపుణుల సలహాలు పొందవచ్చు.
9/9
ఎక్స్‌పోను సందర్శించడానికి, సమాచారం పొందడానికి, అడ్మిషన్ల ప్రక్రియకు ఎలాంటి రుసుం ఉండదు. ఏకకాలంలో దేశంలోని ఇన్ని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
Updated at - Mar 19 , 2026 | 07:53 PM