అమెరికా రాజధాని వేదికగా.. ‘నిజం గెలిచింది’
ABN , Publish Date - Sep 13 , 2026 | 07:12 PM
అమెరికా రాజధాని వేదికగా తెలుగురాష్ట్రాలకు సంబంధించిన ప్రవాస భారతీయుల ఆధ్యర్యంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎన్ఆర్ఐ మాగులూరి భానుప్రకాశ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: 2023లో నాటి ప్రతిపక్షనేత, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబును అప్పటి వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి మూడేళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్ఆర్ఐ మాగులూరి భానుప్రకాశ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పలువురు ప్రవాసీ పెద్దలు మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని విమర్శించారు. ఆనాటి అప్రజాస్వామిక పాలనా విధానాన్ని వారు ఖండించారు. ఈ నేపథ్యంలో అధికారం, పదవులకు అతీతంగా వ్యవహరిస్తూ.. భారత రాజ్యాంగాన్ని అనుసరించాలని.. ప్రజాస్వామ్య పాలనా స్ఫూర్తిని పాటించాలని వారు పిలుపునిచ్చారు.
భానుప్రకాశ్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అప్రజాస్వామికంగా అర్ధరాత్రి అరెస్టు చేసి, 53 రోజుల పాటు రిమాండ్‌కు పంపినా.. చంద్రబాబు పోరాటస్ఫూర్తిని, ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్న విశ్వాసాన్ని ఏ మాత్రం దెబ్బతీయలేకపోయారన్నారు. 53 రోజులపాటు జైల్లో ఉన్న చంద్రబాబు కోసం రాష్ట్రంలో ప్రజలే కాదు.. ప్రవాస భారతీయులు కూడా కూడా ‘నిజం గెలవాలి’ అంటూ మద్దతుగా నిలిచారని ఆయన గుర్తుచేశారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడేందుకు కలిసి వచ్చిన జనసేనాని పవన్ కల్యాణ్‌కు, బీజేపీ పెద్దలకు అభినందనలు అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు అభినందనలు తెలిపారు. కూటమి ఐక్యత ఇలాగే కొనసాగాలని ఆశించారు. దేశం, తెలుగు రాష్ట్రాల ప్రగతి సమర్థ నాయకత్వంలో సర్వతోముఖాభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు.
ఈ వార్తలనూ చదవండి:
అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవాలి: మోదీ
‘రా రా కన్నా’.. కొడుకు కోసం నదీ తీరంలో ఓ తల్లి నిరీక్షణ