Share News

లండన్‌లోని ఇండియా డే వేడుకల్లో ‘తెలంగాణ స్టాల్’

ABN , Publish Date - Aug 24 , 2026 | 08:08 PM

భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. లండన్‌లోని భారత హై కమిషన్, భారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా నిర్వహించిన ఇండియా డే వేడుకల్లో.. తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) (TAUK), తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించింది.

లండన్‌లోని ఇండియా డే వేడుకల్లో  ‘తెలంగాణ స్టాల్’

తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిత్యం వహిస్తూ ‘తెలంగాణ స్టాల్’

తెలంగాణ స్టాల్‌ను ప్రారంభించిన టాక్ అధ్యక్షడు రత్నాకర్ కడుదుల

లండన్ : భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. లండన్‌లోని భారత హై కమిషన్, భారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా నిర్వహించిన ఇండియా డే వేడుకల్లో.. తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) (TAUK), తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించింది. భారత హైకమిషనర్ పెరియాసామి కుమారన్ ముందుగా జెండా ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా తెలంగాణ ప్రత్యేకతతో టాక్ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్‌ని టాక్ అధ్యక్షడు రత్నాకర్ కడుదుల ప్రారంభించారు. యూకే నలుమూలల నుంచి వేలాదిమంది మంది ప్రవాస భారతీయులు ఈ వేడుకలకు హాజరయ్యారు.

nri4.jpg


తెలంగాణ రాష్ట్ర ప్రాతినిధ్యం ఉట్టి పడేలా..

తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను, చరిత్రను, బాషా, సంస్కృతి, పర్యాటక ప్రత్యేకత, అభివృద్ధి.. ఇలా వీటన్నింటి సమాచారాన్ని స్టాల్‌‌లో ప్రదర్శించి, హాజరైన వారందరికీ తెలంగాణ ప్రత్యేకత గురించి వివరించారు. స్టాల్‌లో ఏర్పాటు చేసిన జాతీయ నాయకులు, తెలంగాణా ప్రముఖుల చిత్రపటాలకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యత, విశిష్టత గురించి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు, ఇతర ఆతిథులకు తెలియజేయాలనే భావనతో.. టాక్ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రముఖులు సాధించిన విజాయాలతో కూడిన ప్రత్యేక ‘తెలంగాణా స్టాల్’ని ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థ ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు తెలిపారు.

nri1.jpg


ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిత్యం వహిస్తూ కేవలం టాక్ సంస్థ మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో గర్వంగా ఉందని, వ్యక్తిగతంగా ఎంతో బిజీగా ఉన్నపటికీ వాటన్నిటీనీ పక్కన బెట్టి బాధ్యత గల సంస్థగా, తెలంగాణ బిడ్డలుగా ఇందులో భాగ్వములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, తెలంగాణ ప్రత్యేక స్టాల్ నిర్వాహణకు కృషి చేసి సహకరించిన కార్యవర్గ సభ్యులకు టాక్ ఈవెంట్స్ ఇన్‌ఛార్జి మల్లా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. స్టాల్‌ను సందర్శించిన ప్రముఖులు, ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులకు టాక్ ఉపాధ్యక్షుడు సురేష్ బుడగం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతి - సాంప్రదాయాలు, తెలంగాణ విజయాలు, పర్యాటక ప్రత్యేకత.. చాలా గొప్పగా ఉందని, నూతన రాష్ట్ర సంస్కృతిని, గొప్పతన్నాని, ప్రపంచానికి చూపెట్టాలనే ప్రయత్నం చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని హాజరైన ప్రవాస భారతీయులు ప్రశంశించారు.

nri.jpg


ప్రవాస తెలంగాణా బిడ్డలు స్టాల్‌ని సందర్శించి, తెలంగాణకు ప్రత్యేక స్టాల్‌ని చూడడం చాలాగర్వంగా ఉందని, తెలంగాణా ప్రాముఖ్యతను ప్రదర్శిస్తున్న తీరుని అభినందించారు. ఫొటోలు, సెల్ఫీలతో టాక్ సంస్థ స్టాల్ సందడిగా మారింది. ‘తెలంగాణా స్టాల్’ని సందర్శించిన ఆతిథులందరికీ హైదరాబాద్ బిర్యానీని రుచి చూపించడం జరిగిందని టాక్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ జెల్ల తెలిపారు. కార్యక్రమంలో టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, కార్యవర్గ సభ్యులు సురేష్ బుడగం, రాకేష్ పటేల్, సుప్రజ పులుసు, శ్రీకాంత్ జెల్ల, పవిత్ర, నవీన్ రెడ్డి, సత్యపాల్ రెడ్డి, మల్లా రెడ్డి, వెంకట్ రెడ్డి, స్వాతి, సత్యం కంది, హరి గౌడ్, క్రాంతి రేతినేని, రవి పులుసు, శ్రీ లక్ష్మి, సందీప్, సాయి కిరణ్ కనుగుల, అబ్దుల్ ఖుద్దూస్, అద్విత్ కంది, పావని తదితరులు పాల్గొన్నారు.

nri7.jpgnri8.jpgnri2.jpgnri3.jpg

Updated Date - Aug 24 , 2026 | 08:11 PM