Share News

Black Coffee Benefits: బ్లాక్‌ కాఫీ భేష్‌

ABN , Publish Date - Jan 13 , 2026 | 06:58 AM

టీ, కాఫీల కంటే బ్లాక్‌ కాఫీ మేలైన పానీయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకో తెలుసుకుందాం...

Black Coffee Benefits: బ్లాక్‌ కాఫీ భేష్‌

మీకు తెలుసా?

టీ, కాఫీల కంటే బ్లాక్‌ కాఫీ మేలైన పానీయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకో తెలుసుకుందాం!

  • తక్షణ చురుకుదనం: ఒక కప్పు బ్లాక్‌ కాఫీలో 95 మిల్లీగ్రాముల కెఫీన్‌ ఉంటుంది. క్యాలరీలు ఏమాత్రం ఉండవు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు పాలు, చక్కెర కలపని బ్లాక్‌ కాఫీ తాగాలి.

  • ఆరోగ్య రక్ష: అలాగే బ్లాక్‌ కాఫీలో ‘క్లోరోజెనిక్‌ యాసిడ్‌’ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వాపులను తగ్గించడమే కాకుండా, టైప్‌-2 మధుమేహం, హృద్రోగాల నుంచి రక్షణ కల్పిస్తాయి. టీలో ఉండే పాలీఫినాల్స్‌ కంటే కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరింత విభిన్నంగా ఉండి సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి.

  • శారీరక సామర్థ్యం: అథ్లెట్లు, జిమ్‌కు వెళ్లే వారికి కెఫీన్‌ మంచి సప్లిమెంట్‌. వ్యాయామాలకు ముందు బ్లాక్‌ కాఫీ తాగడం వల్ల శరీరం శక్తిని పుంజుకుంటుందనీ, కండరాల పనితీరు మెరుగుపడుతుందనీ పరిశోధనలు చెబుతున్నాయి

  • బరువు తగ్గిస్తుంది: కెఫీన్‌ శరీరంలోని కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంలో సాయపడుతుంది. ఇది శరీర వేడిని పెంచి, క్యాలరీలను వేగంగా ఖర్చు చేయడంలో తోడ్పడుతుంది. టీతో పోలిస్తే కాఫీ తాగడం వల్ల రోజువారీ క్యాలరీలు గణనీయంగా ఖర్చవుతాయి.

ఇవి కూడా చదవండి..

ట్రంప్, మోదీ మధ్య నిజమైన స్నేహబంధం.. అమెరికా రాయబారి గోర్

పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 13 , 2026 | 06:58 AM