Muthyala Muggula Finalists Announced: సంతూర్ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు
ABN , Publish Date - Jan 07 , 2026 | 05:01 AM
(పవర్డ్ బై సన్‌ఫీస్ట్ మామ్స్ మ్యాజిక్ బిస్కెట్లు... టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ వారి భారత్‌వాసీ అగర్‌బత్తి) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 81 కేంద్రాల్లో...
సంతూర్ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలు
ఫైనలిస్టులు వీరే
ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు
(పవర్డ్ బై సన్‌ఫీస్ట్ మామ్స్ మ్యాజిక్ బిస్కెట్లు... టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ వారి భారత్‌వాసీ అగర్‌బత్తి) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 81 కేంద్రాల్లో జనవరి 3, 4, 5, 6 తేదీల్లో ఘనంగా జరిగాయి. 12 వేల మందికి పైగా మహిళలు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి కేంద్రంలో ప్రథమ బహుమతి రూ.6,000, ద్వితీయ బహుమతి రూ.4,000, తృతీయ బహుమతి రూ.3,000తో పాటు అనేక కన్సొలేషన్ బహుమతులు అందించాం. ప్రతి జిల్లా స్థాయిలో విజేతగా నిలిచిన మహిళలు రాష్ట్ర స్థాయిలో జరిగే ఫైనల్ పోటీలకు అర్హత సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 28 జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు విజేతలిద్దరు.. మొత్తం 30 మందికి జనవరి 10న విజయవాడలో ఫైనల్ పోటీలు జరుగుతాయి. తెలంగాణలోని 33 జిల్లాల విజేతలకు హైదరాబాద్‌లో జనవరి 12న ఫైనల్ పోటీలు జరుగుతాయి. ఫైనలిస్టులకు రూ.2,40,000కు పైగా బహుమతులు ఉంటాయి. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనబోతున్న ఫైనలిస్టులు, వారు జిల్లాస్థాయి పోటీల్లో తీర్చిదిద్దిన అందమైన రంగవల్లులు నవ్య పాఠకుల కోసం..
ఇవి కూడా చదవండి..
పీఓకే సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్
మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి