తెలుసుకోవాల్సింది అదే!
ABN , Publish Date - May 29 , 2026 | 01:52 AM
నేను ఎవరు? ఎక్కడినుంచి వచ్చాను? ఈ భూమి మీద మానవుడిగా ఎందుకు జన్మించాను? ఈ మానవ జన్మ పరమార్థం ఏమిటి? ఈ జన్మ ముగిసిన తరువాత నా పయనం ఎటువైపు?...
సహజయోగ
నేను ఎవరు? ఎక్కడినుంచి వచ్చాను? ఈ భూమి మీద మానవుడిగా ఎందుకు జన్మించాను? ఈ మానవ జన్మ పరమార్థం ఏమిటి? ఈ జన్మ ముగిసిన తరువాత నా పయనం ఎటువైపు?... సత్వాన్వేషకులు చాలామంది ఆలోచనల్లో ఈ ప్రశ్నలు తరచుగా మెదులుతూ ఉంటాయి. మనల్ని మనం తెలుసుకుంటే వీటికి సమాధానం లభిస్తుందంటూ ఎందరో మహానుభావులు మార్గాన్ని చూపించారు.
‘‘నీవు కేవలం ఆత్మవు. శరీరానివో, బుద్ధివో, అహంకారానివో కాదు’’ అని ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు స్పష్టంగా తెలియజేశాడు. ఆది శంకరులు ‘‘నీవు ఆత్మవు’’ అంటూ సంపూర్ణ వివరణ ఇచ్చారు. ‘‘దేవుణ్ణి తెలుసుకోవడానికి ముందు నిన్ను నువ్వు తెలుసుకో’’ అని గౌతమ బుద్ధుడు, మహావీరుడు కూడా చెప్పారు. ఆది గురువైన దత్తాత్రేయుడు పది అవతారాల ద్వారా ‘నీవు ఎవరు?’ అనేది తెలియజేసే ప్రయత్నం చేశాడు. ఏసు క్రీస్తు కూడా ‘‘నో దై సెల్ఫ్’’ అన్నాడు. ‘‘నిన్ను నువ్వు తెలుసుకోవాలి’’ అని దాని అర్థం. మహమ్మద్ ప్రవక్త, గురునానక్, కబీర్ దాసు, వేమన, రమణ మహర్షి... ఇలా అనేకమంది గురువులు ఇదే చెబుతూ వచ్చారు. మనలోని ఆత్మను ఎలా తెలుసుకోవాలో, పరమాత్ముడితో ఎలా అనుసంధానం కావాలో వివిధ మార్గాల ద్వారా బోధించి, మానవాళిని ముందుకు నడిపించడానికి పాటుపడ్డారు.
కాగా. పై ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకొనే ఒక విధానాన్ని సహజయోగ రూపంలో మానవాళికి శ్రీమాతాజీ నిర్మలాదేవి ప్రసాదించారు. దాని ద్వారా మనలో ఉన్న ఆత్మ, సూక్ష్మ శరీరాల ఉనికిని గుర్తించవచ్చు, అనుభూతిపరంగా వాటిని తెలుసుకోవచ్చు. లోకాన్ని సంక్షుభితం చేస్తున్న కల్లోలాల నుంచి, అశాంతి నుంచి వ్యాధుల నుంచి రక్షణ పొందడం కోసం... మనలో ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేసుకోవాలి. ఆత్మను ప్రకాశవంతం చేసుకోవాలి. స్వీయ అనుభవం ద్వారా మనలోని సూక్ష్మ శరీరాన్ని అవగాహన చేసుకోవాలి. దీనికి దోహదపడే మహా యోగం... సహజయోగ. దాని అభ్యాసం ద్వారా మనల్ని మనం తెలుసుకొనే ప్రయత్నం చేస్తే... ఆత్మ సాక్షాత్కారం సిద్ధిస్తుంది. మన ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి.
డాక్టర్ పి. రాకేష్, 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ
నిర్మలాదేవి, సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ
ఈ వార్తలు కూడా చదవండి...
దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News