Share News

త్యాగమే పునాది

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:20 AM

క్రైస్తవ జీవనానికి పునాది త్యాగం. ‘త్యాగం’ అంటే మనకు ఇష్టమైనదాన్ని వదులుకోవడం. దేవుడు తన ఏకైక కుమారుడైన ఏసుక్రీస్తును ఈ భూలోకానికి పంపాడు. క్రీస్తు తన ఇష్టాన్ని కాకుండా... ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మానవాళి శ్రేయస్సు కోసం శిలువను ఎక్కి, ప్రాణత్యాగం చేశాడు. ఆ త్యాగాన్ని విశ్వాసులు నిత్యం గుర్తు చేసుకోవాలి.

త్యాగమే పునాది

క్రైస్తవ జీవనానికి పునాది త్యాగం. ‘త్యాగం’ అంటే మనకు ఇష్టమైనదాన్ని వదులుకోవడం. దేవుడు తన ఏకైక కుమారుడైన ఏసుక్రీస్తును ఈ భూలోకానికి పంపాడు. క్రీస్తు తన ఇష్టాన్ని కాకుండా... ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మానవాళి శ్రేయస్సు కోసం శిలువను ఎక్కి, ప్రాణత్యాగం చేశాడు. ఆ త్యాగాన్ని విశ్వాసులు నిత్యం గుర్తు చేసుకోవాలి. ‘‘నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు’’ అనే పౌలు మాటను మననం చేసుకుంటూ ఉండాలి. స్వార్థానికి, అహానికి, కోరికలకు శిలువ వేయాలి.

క్రైస్తవ ధర్మంలో త్యాగం మూడు విధాలుగా కనిపిస్తుంది. దేవుని కోసం త్యాగం, సమాజం కోసం త్యాగం, కుటుంబం కోసం త్యాగం. దేవుని కోసం త్యాగం అంటే ప్రతిరోజూ ప్రార్థనకు, వాక్య ధ్యానానికి మన సమయాన్ని త్యాగం చేయడం... అంటే కేటాయించడం. దాన ధర్మాలు చేయడం. చెడు అలవాట్లను విడిచిపెట్టడం. సంఘం కోసం త్యాగం అంటే... ఒకరి భారాన్ని మరొకరు మోయడం, బాధ్యతలు పంచుకోవడం, క్షమించడం, అవసరమైన సహాయం చేయడం. కుటుంబం కోసం త్యాగం అంటే... భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని, అహాన్ని త్యాగం చేయడం. దీనివల్ల కుటుంబం నిలబడుతుంది. విలాసాలను ఆశించని జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఇదే క్రీస్తు జీవితం, బోధనల సారాంశం.

డాక్టర్‌ యం. సోహినీ బెర్నార్డ్‌

9866755024

ఈ వార్తలనూ చదవండి:

అడవిని గెలిచిన ధీర

కాలేయ క్యాన్సర్‌కు మద్యం ఒక్కటే కారణం కాదు

Updated Date - Sep 18 , 2026 | 12:20 AM