జొన్న రొట్టె మెత్తగా..!
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:45 AM
జొన్న పిండిలో గ్లూటెన్ ఉండదు కాబట్టి దానితో రొట్టె చేసి పెనం మీద కాల్చడం కష్టంగా అనిపిస్తుంటుంది. అది విరగకుండా మెత్తగా వచ్చేందుకు ఏ చిట్కాలు పాటించాలో చూద్దాం...
జొన్న పిండిలో గ్లూటెన్ ఉండదు కాబట్టి దానితో రొట్టె చేసి పెనం మీద కాల్చడం కష్టంగా అనిపిస్తుంటుంది. అది విరగకుండా మెత్తగా వచ్చేందుకు ఏ చిట్కాలు పాటించాలో చూద్దాం...
ఒక కప్పు జొన్న పిండిలో చెంచా ఇసబ్‌గోల్ పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత బాగా మరిగిన నీళ్లను కొద్దికొద్దిగా పోస్తూ గరిటెతో కలపాలి. పిండిలో కొద్దిగా జిగురు ఏర్పడుతుంది. గిన్నెమీద మూతపెట్టి అయిదు నిమిషాలు ఉంచాలి. అప్పుడే పిండి బాగా నాని చల్లారుతుంది. తరువాత అరచేతికి నూనె రాసుకుని పిండిని బాగా ఒత్తుతూ మరో అయిదు నిమిషాలు కలిపి ముద్ద చేయాలి.
కొద్దిగా పిండిని చేత్తో తీసుకుని గుండ్రని బిళ్లలా చేసి పీటమీద పెట్టి పొడి పిండి చల్లుతూ అరచేత్తో తడుతూ పలుచని రొట్టెలా చేయాలి. చపాతీ కర్రతో కూడా పామవచ్చు. అంచులు మరీ పగలకుండా చూసుకోవాలి.
స్టవ్ మీద పెనం పెట్టి బాగా వేడిచేయాలి. తరువాత మెల్లగా రొట్టెను వేసి పైన తడి గుడ్డతో తుడవాలి. ఆపైన రొట్టెను రెండో వైపునకు తిప్పి మరల తడి గుడ్డతో తుడవాలి. రొట్టె పొడిబారకుండా తడిచేస్తూ ఉండాలి. తడి గుడ్డతో మధ్యమధ్యలో నొక్కుతూ ఉంటే రొట్టె బాగా పొంగుతుంది. ఇలా రెండు వైపులా దోరగా కాల్చి జాగ్రత్తగా పళ్లెంలోకి తీయాలి. ఈవిధంగా చేసిన జొన్న రొట్టెలు తరువాతి రోజు కూడా మెత్తగానే ఉంటాయి.
Also Read:
భారత సినీ రంగానికి అనంత్ నాగ్ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్
రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు