Share News

స్మార్ట్‌ డోర్‌ లాక్‌లు

ABN , Publish Date - Sep 17 , 2026 | 12:44 AM

బయటికి వెళ్లేటప్పుడు ఇంటి ప్రవేశ ద్వారానికి వేసే కొత్త రకం లాక్‌ల గురించి తెలుసుకుందాం...

స్మార్ట్‌ డోర్‌ లాక్‌లు

బయటికి వెళ్లేటప్పుడు ఇంటి ప్రవేశ ద్వారానికి వేసే కొత్త రకం లాక్‌ల గురించి తెలుసుకుందాం...

ఫింగర్‌ ప్రింట్‌ డోర్‌ లాక్‌: ముందుగా దీనిలో కుటుంబ సభ్యుల వేలి ముద్రలను సేవ్‌ చేస్తారు. తరువాత సంబంధిత స్కానర్‌ ప్యాడ్‌ను తలుపునకు బయటివైపున అమరుస్తారు. తలుపు మూయగానే దానంతటదే లాక్‌ అవుతుంది. హ్యాండిల్‌ను పైకెత్తి లేదా ప్యాడ్‌పై లాక్‌ బటన్‌ను ప్రెస్‌ చేసి కూడా డోర్‌ లాక్‌ చేయవచ్చు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఎవరైనా తమ వేలిని స్కానర్‌పై ఉంచితే సెకన్లలో తలుపు తెరచుకుంటుంది. ఇది రీఛార్జబుల్‌ బ్యాటరీలతో పనిచేస్తుంది.

పిన్‌కోడ్‌ డోర్‌ లాక్‌: ఇందులో కీప్యాడ్‌, మైక్రోప్రాసెసర్‌, ఎలక్ట్రిక్‌ మోటార్‌, పవర్‌ సోర్స్‌ ఉంటాయి. ఇందులో నాలుగు నుంచి ఎనిమిది అంకెల రహస్య కోడ్‌ను ముందుగా సెట్‌ చేసుకోవాలి. కుటుంబ సభ్యులు వేర్వేరు కోడ్‌లను ఎంచుకోవచ్చు. కీప్యాడ్‌పై కోడ్‌ను ఎంటర్‌ చేయగానే మైక్రోప్రాసెసర్‌ పంపిన సిగ్నల్‌తో ఎలక్ట్రిక్‌ మోటార్‌ తిరిగి డోర్‌ బోల్ట్‌ను లోపలికి లాగుతుంది. దీంతో తలుపు తెరచుకుంటుంది. పలుమార్లు కోడ్‌ను తప్పుగా ఎంటర్‌ చేస్తే అలారం మోగుతుంది. బంధువులు వచ్చినప్పుడు ఒక్కసారి మాత్రమే పనిచేసే తాత్కాలిక కోడ్‌లను క్రియేట్‌ చేసి ఇవ్వవచ్చు.


మొబైల్‌ యాప్‌ డోర్‌ లాక్‌: ఈ స్మార్ట్‌ లాక్‌ను బ్లూ టూత్‌ లేదా వైఫై ద్వారా మొబైల్‌ యాప్‌నకు అనుసంధానం చేస్తారు. ఆ యాప్‌ లో ఉండే లాక్‌, అన్‌లాక్‌ బటన్లను ప్రెస్‌ చేసి తలుపు మూయవచ్చు, తెరవవచ్చు. ఇంటర్నెట్‌ సహాయంతో బంధువులకు, అతిథులకు తాత్కాలికంగా యాప్‌ ద్వారా తలుపు తెరవడానికి అనుమతి ఇవ్వవచ్చు. ఎవరైనా డోర్‌ బెల్‌ కొట్టి నా, తలుపు లాక్‌ తీసినా వేసినా వెంటనే మొబైల్‌కు మెసేజ్‌ వస్తుంది. డోర్‌ లాక్‌, అన్‌లాక్‌ హిస్టరీని ఎప్పుడైనా యాప్‌లో చూసుకోవచ్చు.

ఆర్‌ఎప్ఐడీ కార్డ్‌ లాక్‌: ఇది రేడియో తరంగాలతో పనిచేసే వైర్‌లెస్‌ సెక్యూరిటీ సిస్టమ్‌. ఇందులో కార్డ్‌, రీడర్‌, కంట్రోల్‌ యూనిట్‌ ఉంటాయి. కార్డులో సెక్యూరిటీ కోడ్‌తో ఉన్న మైక్రో చిప్‌, యాంటెన్నా ఉంటాయి. తలుపుపై అమర్చిన లాక్‌లో రీడర్‌ ఉంటుంది. కార్డ్‌ను రీడర్‌కు దగ్గరగా తెచ్చినప్పుడు డేటా వెరిఫికేషన్‌ జరిగి లాక్‌ ఓపెన్‌ అవుతుంది. ఇలాగే డోర్‌లాక్‌ కూడా చేయవచ్చు. ఈ కార్డ్‌ను యాక్టివేట్‌ చేసుకుంటే సరిపోతుంది. డోర్‌ లాక్‌, అన్‌లాక్‌ హిస్టరీని లాక్‌ సిస్టమ్‌ డేటాబే్‌సలో చూడవచ్చు.

Also Read:

భారత సినీ రంగానికి అనంత్ నాగ్‌ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్

రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 17 , 2026 | 12:44 AM