Pistachio Health Benefits: పిస్తాతో ఆరోగ్యం మీ గుప్పిట్లో...
ABN , Publish Date - Jan 06 , 2026 | 04:24 AM
పోషకాల గని: పిస్తాపప్పులో ప్రొటీన్లు, పీచుపదార్థంతోపాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. కీలకమైన విటమిన్లు, మినరల్స్ వీటికి ‘సూపర్ ఫుడ్’ హోదాను...
పోషకాల గని: పిస్తాపప్పులో ప్రొటీన్లు, పీచుపదార్థంతోపాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. కీలకమైన విటమిన్లు, మినరల్స్ వీటికి ‘సూపర్ ఫుడ్’ హోదాను కట్టబెట్టాయి.
గుండెకు రక్షణ కవచం: శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉండి, గుండె జబ్బుల ముప్పు తప్పుతుంది.
బరువు తగ్గాలనుకునే వారికి వరం: పిస్తాలో ఉండే పీచు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.
దీనివల్ల అనవసరమైన చిరుతిళ్లపై వ్యామోహం తగ్గుతుంది. ఫలితంగా బరువు సులభంగా అదుపులోకి వస్తుంది.
పేగు ఆరోగ్యం భద్రం: పిస్తాపప్పులు ప్రిబయాటిక్స్‌గా పనిచేస్తాయి. ఇవి మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాకు ఆహారాన్ని అందించి, జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచుతాయి.
కంటి వెలుగుకు భరోసా: వయసు పెరగడం వల్ల వచ్చే కంటిచూపు సమస్యలను నివారించడంలో పిస్తా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ల్యుటిన్, జియాక్సాంథిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు చూపును మెరుగు పరుస్తాయి.
ఇవి కూడా చదవండి..
పీఓకే సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్
మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి