Share News

పాత మెరుపులకు సెలవు!

ABN , Publish Date - Feb 01 , 2026 | 05:57 AM

మారుతున్న కాలంతోపాటు మగువల మనసు, వారి అలంకరణాభిరుచులు వేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకు సింప్లిసిటీ మంత్రంగా సాగిన జువెలరీ...

పాత మెరుపులకు సెలవు!

ట్రెండ్‌

మారుతున్న కాలంతోపాటు మగువల మనసు, వారి అలంకరణాభిరుచులు వేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకు సింప్లిసిటీ మంత్రంగా సాగిన జువెలరీ ఫ్యాషన్‌ ఇప్పుడు స్టేట్‌మెంట్‌ వైపు మళ్లింది. ఈ ఏడాది ఏ ఆభరణాలు కనుమరుగవుతున్నాయి? ఏ కొత్త డిజైన్లు మన నగల్లో చేరబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్యాషన్‌ నుంచి

తప్పుకుంటున్నవి

మైక్రో మినిమలిజం: చూడగానే కనిపించనంత సన్నని చైన్లు, చిన్నపాటి రింగుల హవా ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. ‘తక్కువలో ఎక్కువ అందం’ సూత్రం కంటే ‘కనిపించేలా ఉండటం’ అనే ధోరణి పెరుగుతోంది.

లేయర్డ్‌ చైన్లు: ఐదు, పది పేటలుగా సన్నని చైన్లు వేసుకునే పద్ధతి పాతబడిపోయింది. దీనివల్ల మెడభాగం గజిబిజిగా కనిపిస్తుండటంతో ఫ్యాషన్‌ ప్రియులు దీనికి స్వస్తి పలుకుతున్నారు.

ఒకే రకమైన సెట్లు: నెక్లెస్‌, చెవి రింగులు, గాజులు అన్నీ ఒకే డిజైన్‌లో ఉండటాన్ని ఇప్పుడు బోరింగ్‌ ఫ్యాషన్‌గా పరిగణిస్తున్నారు. ఇప్పుడు అంతా మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ కాలం.

ఫ్యాషన్‌ ప్రపంచంలోకి వస్తున్నవి

శిల్పకలా సౌందర్యం: ప్రస్తుతం ఆభరణాలు ఒక శిల్పంలా కనిపిస్తున్నాయి. ఒక పద్ధతి ప్రకారం కాకుండా సహజమైన వంపులు, ఆకృతులతో కూడిన బంగారు ఆభరణాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. చూసేవారికి ఇవి ఒక కళాఖండంలా అనిపిస్తాయి.

పవర్‌ కఫ్స్‌ అండ్‌ బోల్డ్‌ బ్యాంగిల్స్‌: చేతికి ధరించే చిన్న గాజుల స్థానంలో మణికట్టును కప్పేసేంత పెద్దవైన ‘పవర్‌ కఫ్స్‌’ వస్తున్నాయి. ఒక్కటి ధరిస్తే చాలు చేతికి మరే ఇతర అలంకారం అవసరం లేదు.

ముత్యాలు: పూర్తిగా గుండ్రంగా ఉండే ముత్యాల కంటే సహజంగా పెరిగేటప్పుడు వచ్చే వింత ఆకృతులతో కూడిన ‘బారోక్‌ పెర్ల్స్‌’ ఇప్పుడు హాట్‌కేక్‌. ఇవి ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తాయి.

ఎథ్నిక్‌ విత్‌ మోడ్రన్‌ టచ్‌: మన పురాతన ఆలయ నగలకు ఆధునిక స్పర్శను జోడించి డిజైన్‌ చేస్తున్నారు. పెద్దపెద్ద హారాలకు బదులుగా ఒకే ఒక భారీ లాకెట్‌ ఉన్న చైన్లు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..

ఆర్థిక శాఖ మినహా సునేత్రకు మూడు శాఖలు..

మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్

For More National News And Telugu News

Updated Date - Feb 01 , 2026 | 05:57 AM