Share News

అద్భుతం...‘ఆమ్రపాలి భారతం’

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:59 AM

ప్రముఖ పారిశ్రామికవేత్త అంబానీ ఇంట జరిగే ప్రతి వేడుకా, ఆ కుటుంబం ధరించే ప్రతి నగా యావత్‌ ప్రపంచాన్నీ ఆకర్షించేంత వైభవంగా ఉంటుంది. తాజాగా చవితినాడు నీతాఅంబానీ ధరించిన‘ఆమ్రపాలి భారతం’ అనే ఒక భారీ నగ అందర్నీ ఆకట్టుకుంది. విభిన్న ఆభరణాల మిశ్రమమైన ఈ ఆభరణం విశేషాల గురించి తెలుసుకుందాం!

అద్భుతం...‘ఆమ్రపాలి భారతం’

ప్రముఖ పారిశ్రామికవేత్త అంబానీ ఇంట జరిగే ప్రతి వేడుకా, ఆ కుటుంబం ధరించే ప్రతి నగా యావత్‌ ప్రపంచాన్నీ ఆకర్షించేంత వైభవంగా ఉంటుంది. తాజాగా చవితినాడు నీతాఅంబానీ ధరించిన‘ఆమ్రపాలి భారతం’ అనే ఒక భారీ నగ అందర్నీ ఆకట్టుకుంది. విభిన్న ఆభరణాల మిశ్రమమైన ఈ ఆభరణం విశేషాల గురించి తెలుసుకుందాం!

ఎంతటి నెక్లెస్‌ అయినా అది మెడ వరకే పరిమితం. కానీ నీతా అంబానీ ధరించిన నెక్లెస్‌ భుజాల వరకూ వ్యాపించి, ఆభరణానికి బదులుగా కవచాన్ని మరిపించింది. ఈ నగలో పై సగభాగాన్నీ సంప్రదాయ కేరళ నెక్లెస్‌ ఆక్రమిస్తే, నెక్లెస్‌ చుట్టూరా దక్షిణ భారతీయ నథ్‌లు, బిళ్లలు, ఝూమర్లు, చాంద్‌బాలీలు ఒదిగిపోయాయి. వీటన్నిటి మధ్యలో ఖాళీలను ముత్యాలు, జాతిరాళ్లు భర్తీ చేశాయి. ఇలా విడివిడిగా విభిన్నంగా కనిపించే, వేర్వేరు దశాబ్దాలకు చెందిన ఈ ఆభరణాలన్నీ ఒకే నెక్లెస్‌గా రూపాంతరం చెంది విభిన్నమైన, విలక్షణమైన ఆకర్షణను తెచ్చిపెట్టడం చెప్పుకోదగిన విశేషం.

మూడేళ్ల శ్రమ

ఆమ్రపాలి జ్యువెల్స్‌ సిఇవొ, తరంగ్‌ అరోరా ఈ అద్భుతమైన నగ తయారీ విధానం గురించి వివరిస్తూ... ‘‘ఈ తరహా నెక్లెస్‌ తయారీ కోసం మొదట డిజైన్‌ను కాగితం మీద గీయడం కుదరదు. వేర్వేరు ఆభరణాలను ఒక దగ్గర పరిచి, అవన్నీ అందంగా ఇమిడిపోయి, ఆకట్టుకునే రూపాన్ని సంతరించుకునేవరకూ వాటి స్థానాలను మారుస్తూ సంతులనం సాధించాలి. ఇలాంటి సంతృప్తికరమైన కళాఖండాన్ని రూపొందించడానికి కొన్ని వారాలు సరిపోవు. ఈ ప్రాచీన వింటేజ్‌ ఆభరణాలను సమీకరించడానికి మూడేళ్ల సమయం పట్టింది. కాబట్టి ఈ నగ మూడేళ్ల శ్రమ ఫలితమని చెప్పవచ్చు’’ అని ఆమ్రపాలి భారతం గురించి వివరించారాయన.


14 మంది కళాకారుల కృషి

14 మంది కళాకారులు విడి నగలన్నిటినీ జోడించి, చిట్టచివరి అమరికను సాధించడం కోసం నెలల తరబడి కష్టపడ్డారు. ఈ ఆభరణాన్ని జాగ్రత్తగా గమనిస్తే, ఆకట్టుకునే పలు రకాల సూక్ష్మ వివరణలు కనిపిస్తాయి. చూసిన ప్రతిసారీ కొత్త వివరాలు బహిర్గతమవుతూ, ఆసక్తిని రేకిస్తాయి. కుందన్‌ పనితనం, ముత్యాల దారాలు, పోల్కి, మీనాకారి పనితనాలు ఈ నగలో మనల్ని ఆకట్టుకుంటాయి.

ఈ వార్తలనూ చదవండి...

మన్యంలో విభిన్న వాతావరణం

కాఫీ ప్రాజెక్టుకు తూట్లు!

Updated Date - Sep 19 , 2026 | 12:59 AM