Share News

నేటి అలంకారం శ్రీ మహాచండీదేవి

ABN , Publish Date - Oct 14 , 2026 | 03:09 AM

ఆశ్వయుజ శుద్ధ చవితి, బుధవారం శరన్నవరాత్రి మహోత్సవాల్లో నాలుగో రోజున విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ మహాచండీదేవిగా దర్శనమిస్తారు. దేవతల..

నేటి అలంకారం శ్రీ మహాచండీదేవి

దేవీ నవరాత్రులు

ఆశ్వయుజ శుద్ధ చవితి, బుధవారం శరన్నవరాత్రి మహోత్సవాల్లో నాలుగో రోజున విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ మహాచండీదేవిగా దర్శనమిస్తారు. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా శ్రీమహాచండీ అమ్మవారు ఉద్భవించింది. శ్రీచండీ అమ్మవారిలో అనేకమంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీమహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్టే. అమ్మవారి అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయని శత్రువులు మిత్రులుగా మారతారని పెద్దలు చెప్పారు. ఏ కోరికలతో అమ్మవారిని ప్రార్థిస్తారో ఆ కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం

నైవేద్యం: కదంబం, చక్కెర పొంగలి, పులిహోర, లడ్డు, రవ్వకేసరి, కట్టె పొంగలి

అలంకరించే చీర రంగు: ఎరుపు

అర్చించే పూల రంగు: ఎరుపు

పారాయణ: చండీ సప్తశతి, లలితా సహస్రనామాలు, ఖడ్గమాల

ఇవి కూడా చదవండి...

.స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై ఎస్‌ఈసీ ఏం చెప్పారంటే

గన్నవరం ఎయిర్‌పోర్టుకు తమిళనాడు సీఎం విజయ్.. ఘన స్వాగతం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 03:09 AM