Share News

విమర్శించే అంతరాత్మ

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:27 AM

మంచి చెడుల విచక్షణ ప్రతి మనిషికీ ఉంటుంది. సజ్జనులు ఆ విచక్షణతో జీవిస్తారు. మంచి పనులు చేస్తారు. చెడుకు దూరంగా ఉంటారు. చెడ్డ వ్యక్తుల సాంగత్యం, చెడు పనుల పట్ల ఆకర్షణ కారణంగా తమ సహజసిద్ధమైన విచక్షణను మనుషులు కోల్పోతారు. దీనివల్ల ఇతరులకు తమ వల్ల హాని కలిగినా... పశ్చాత్తాప భావన వారిలో ఉండదు. చివరకు దైవానుగ్రహానికి వారు దూరమైపోతారు. కాబట్టి మన చర్యలను సమీక్షిస్తూ, విమర్శిస్తూ... మనల్ని సన్మార్గంలో నడిపించేలా అంతరాత్మను కాపాడుకోవాలి. ‘నఫ్స్‌ అల్‌ లవ్వామ’ ప్రాధాన్యత గురించి దివ్య ఖురాన్‌ వివరించింది. ‘నఫ్స్‌ అల్‌ లవ్వాల’ అంటే ‘విమర్శించే అంతరాత్మ’ అని అర్థం. ‘‘మనిషి ఎన్ని సాకులు చెప్పినా... అతని గురించి అతనికి చాలా బాగా తెలుసు’’ అని దివ్య ఖురాన్‌ చెబుతోంది. ‘‘ఏది మంచి, ఏది చెడు అనే మీమాంస వచ్చినప్పుడు... అంతరంగాన్ని అడగాలి. మనస్సాక్షిని ప్రశ్నించి, సమాధానం తెలుసుకోవాలి. ఏ పని వల్ల హృదయానికి అశాంతి కలుగుతుందో, ఏ పని చేస్తున్నప్పుడు మన మనసు బాధపడుతుందో, మనం చేసిన ఏ పని గురించి ఇతరులు తెలుసుకోవడానికి ఇష్టపడమో అది చెడు అని గ్రహించాలి. ‘ఆ పని మంచిదే’ అని ఇతరులు ప్రోత్సహించినా... చెడు పనులు చేయకూడదు. అదే సత్ప్రవర్తన’’ అని దైవప్రవక్త మహమ్మద్‌ స్పష్టం చేశారు. విచక్షణ, ఆత్మవిమర్శ... ఇవి మానవులకు దేవుడు ప్రసాదించిన వరాలు. వాటిని వినియోగించుకొని మంచి ప్రవర్తనతో మెలిగేవారు దైవానికి ప్రీతిపాత్రులవుతారు.

విమర్శించే అంతరాత్మ

మంచి చెడుల విచక్షణ ప్రతి మనిషికీ ఉంటుంది. సజ్జనులు ఆ విచక్షణతో జీవిస్తారు. మంచి పనులు చేస్తారు. చెడుకు దూరంగా ఉంటారు. చెడ్డ వ్యక్తుల సాంగత్యం, చెడు పనుల పట్ల ఆకర్షణ కారణంగా తమ సహజసిద్ధమైన విచక్షణను మనుషులు కోల్పోతారు. దీనివల్ల ఇతరులకు తమ వల్ల హాని కలిగినా... పశ్చాత్తాప భావన వారిలో ఉండదు. చివరకు దైవానుగ్రహానికి వారు దూరమైపోతారు. కాబట్టి మన చర్యలను సమీక్షిస్తూ, విమర్శిస్తూ... మనల్ని సన్మార్గంలో నడిపించేలా అంతరాత్మను కాపాడుకోవాలి.

‘నఫ్స్‌ అల్‌ లవ్వామ’ ప్రాధాన్యత గురించి దివ్య ఖురాన్‌ వివరించింది. ‘నఫ్స్‌ అల్‌ లవ్వాల’ అంటే ‘విమర్శించే అంతరాత్మ’ అని అర్థం. ‘‘మనిషి ఎన్ని సాకులు చెప్పినా... అతని గురించి అతనికి చాలా బాగా తెలుసు’’ అని దివ్య ఖురాన్‌ చెబుతోంది. ‘‘ఏది మంచి, ఏది చెడు అనే మీమాంస వచ్చినప్పుడు... అంతరంగాన్ని అడగాలి. మనస్సాక్షిని ప్రశ్నించి, సమాధానం తెలుసుకోవాలి. ఏ పని వల్ల హృదయానికి అశాంతి కలుగుతుందో, ఏ పని చేస్తున్నప్పుడు మన మనసు బాధపడుతుందో, మనం చేసిన ఏ పని గురించి ఇతరులు తెలుసుకోవడానికి ఇష్టపడమో అది చెడు అని గ్రహించాలి. ‘ఆ పని మంచిదే’ అని ఇతరులు ప్రోత్సహించినా... చెడు పనులు చేయకూడదు. అదే సత్ప్రవర్తన’’ అని దైవప్రవక్త మహమ్మద్‌ స్పష్టం చేశారు. విచక్షణ, ఆత్మవిమర్శ... ఇవి మానవులకు దేవుడు ప్రసాదించిన వరాలు. వాటిని వినియోగించుకొని మంచి ప్రవర్తనతో మెలిగేవారు దైవానికి ప్రీతిపాత్రులవుతారు.

ఈ వార్తలనూ చదవండి:

అడవిని గెలిచిన ధీర

కాలేయ క్యాన్సర్‌కు మద్యం ఒక్కటే కారణం కాదు

Updated Date - Sep 18 , 2026 | 12:27 AM