సైనస్ సమస్యలకు చెక్
ABN , Publish Date - Nov 12 , 2026 | 02:28 AM
చలికాలంలో తరచూ ముక్కులోని గాలిగదులు ఇన్ఫెక్షన్‌కు గురై శ్లేష్మంతో నిండిపోతుంటాయి. దీంతో ముక్కు దిబ్బడ, జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి తదితర సైనస్ సమస్యలు....
చలికాలంలో తరచూ ముక్కులోని గాలిగదులు ఇన్ఫెక్షన్‌కు గురై శ్లేష్మంతో నిండిపోతుంటాయి. దీంతో ముక్కు దిబ్బడ, జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి తదితర సైనస్ సమస్యలు ఎదురవుతుంటాయి. వీటినుంచి ఉపశమనం పొందేందుకు పాటించాల్సిన చిట్కాలివే...
గోరువెచ్చటి నీటిలో 5 చుక్కల యూకలిప్టస్ లేదా పుదీనా నూనె వేసి ఆవిరి పీలిస్తే ముక్కుదిబ్బడ తగ్గుతుంది.
తరచూ గోరువెచ్చటి నీటిని తాగుతుండాలి. వేడివేడిగా సూప్, అల్లం టీ, గ్రీన్ టీ, మిరియాల పొడి కలిపిన పాలు, తేనె కలిపిన నిమ్మరసం, తాజా పండ్ల రసాలను తీసుకున్నా ఉపశమనం లభిస్తుంది.
తువాలు లేదా రుమాలును వేడినీటిలో ముంచి గట్టిగా పిండి నుదుటిమీద, ముక్కుమీద కాపడం పెడుతుంటే గాలి గదుల్లోని శ్లేష్మం పలుచగా మారి బయటికి వెళుతుంది.
స్వీట్లు, ప్రాసెస్డ్ ఫుడ్, చల్లటి పదార్థాలు, పాల ఉత్పత్తులు తీసుకోకూడదు.
రోజుకు రెండుసార్లు ప్రాణాయామం చేస్తుంటే శ్వాసనాళాలు శుభ్రమై సైనస్ సమస్యలు తగ్గుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో మళ్లీ మున్సిపల్ ఎన్నికలు.. రెండ్రోజుల్లో నోటిఫికేషన్
3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్
For More AP News And Telugu News