Share News

శీతాకాలంలో శిరోజాల కోసం...

ABN , Publish Date - Nov 12 , 2026 | 02:22 AM

శీతాకాలంలో చలిగాలులకు మాడు పొడిబారి కుదుళ్లు బలహీనమై శిరోజాలు ఎక్కువగా రాలిపోతుంటాయి. అలాకాకుండా శిరోజాలు తేమతో నిండి ఒత్తుగా పెరగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...

శీతాకాలంలో శిరోజాల కోసం...

శీతాకాలంలో చలిగాలులకు మాడు పొడిబారి కుదుళ్లు బలహీనమై శిరోజాలు ఎక్కువగా రాలిపోతుంటాయి. అలాకాకుండా శిరోజాలు తేమతో నిండి ఒత్తుగా పెరగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...

  • ప్రొటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే గుడ్లు, చేపలు, పాలు, డ్రై ఫ్రూట్స్‌, పప్పు ధాన్యాలను తరచూ తీసుకుంటుండాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలి.

  • మూడు రోజులకోసారి గోరువెచ్చటి కొబ్బరినూనె లేదా బాదం నూనెతో తలంతా మర్దన చేసుకోవాలి. దీనివల్ల మాడుమీద రక్తప్రసరణ మెరుగవుతుంది. శిరోజాలకు తేమ, పోషణ లభించి ఒత్తుగా పెరుగుతాయి.

  • వేడివేడి నీళ్లతో తలస్నానం చేయకూడదు. గోరువెచ్చటి నీటిని మాత్రమే ఉపయోగించాలి.

  • తలస్నానం చేసిన తరువాత శిరోజాలకు కండిషనర్‌ అప్లయ్‌ చేయాలి. కురులను సహజంగా గాలికి ఆరనివ్వాలి. హెయిర్‌ డ్రయ్యర్‌, స్ట్రయిట్‌నర్‌, కర్లింగ్‌ రింగ్స్‌ లాంటివాటిని ఉపయోగించకూడదు. హెయిర్‌ కలరింగ్‌, బ్లీచింగ్‌ తదితరాలను మానేయడం మంచిది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో మళ్లీ మున్సిపల్ ఎన్నికలు.. రెండ్రోజుల్లో నోటిఫికేషన్

3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్

For More AP News And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 02:22 AM