Share News

పిల్లల మెదడు మూలాలు పాదాల్లో...

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:23 AM

రోజంతా పిల్లలకు పాదాలకు సాక్సులు వేసి ఉంచితే, వాళ్ల నాడీ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. శరీరం మొత్తంలోనే అత్యంత ఇంద్రియ సున్నిత ప్రాంతాలు అరికాళ్లు. వాటిలో ఉండే భారీ స్థాయిలోని మెఖానోరిసెప్టార్స్‌...

పిల్లల మెదడు మూలాలు పాదాల్లో...

మీకు తెలుసా?

పిల్లలకు తొడిగే సాక్సులు, బూట్లు, స్లిప్పర్స్‌, మెదడు ఎదుగుదలకు అడ్డుపడతాయని మీకు తెలుసా? ఎందుకో తెలుసుకుందాం!

రోజంతా పిల్లలకు పాదాలకు సాక్సులు వేసి ఉంచితే, వాళ్ల నాడీ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. శరీరం మొత్తంలోనే అత్యంత ఇంద్రియ సున్నిత ప్రాంతాలు అరికాళ్లు. వాటిలో ఉండే భారీ స్థాయిలోని మెఖానోరిసెప్టార్స్‌... పొజిషన్‌, ఆకృతి, సంతులనాలకు సంబంధించిన సమాచారాన్ని నిరంతరం మెదడుకు చేరవేస్తూ ఉంటాయి. సిక్స్త్‌ సెన్స్‌లా పని చేసే ‘ప్రొప్రియోసెప్షన్‌’ శరీర స్థితి గురించి మెదడుకు చెప్తూ ఉంటుంది. బిడ్డ చెప్పులు, సాక్సులు లేకుండా నడిచేటప్పుడు, గురుత్వాకర్షణ లోని ప్రతి చిన్న మార్పునూ పసిగట్టగలుగుతుంది. ఇలా నిరంతరం మెదడుకు అందుతూ ఉండే ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగానే శరీర కదలికలకు సంబంధించిన నాడీ సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎదిగే పిల్లల పాదాలకు బూట్లు తొడిగి ఉంచితే, మెదడుకు అందే ఇంద్రియ సమాచారంలో అవరోధం ఏర్పడుతుంది. దాంతో పరిసరాలను అర్థం చేసుకోవడం కోసం మెదడు అవసరానికి మించి శ్రమకు లోనవుతుంది. ఈ అదనపు భారం వల్ల నాడీ వ్యవస్థ అవసరానికి మించి ప్రేరేపితమవుతూ, పిల్లల్లో అసహనం పెరిగిపోతుంది. కాబట్టి నేలతో చర్మం ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండే ‘గ్రౌండింగ్‌’ మీద తల్లితండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీంతో పిల్లల్లో కార్టిసాల్‌ హార్మోన్‌ క్రమబద్ధమై, నాడీ వ్యవస్థ... పోరాడు - పారిపో’ అనే స్థితి నుంచి ‘విశ్రాంతి - జీర్ణం’ అనే స్థితికి చేరుకుంటుంది. అలాగే పాదాలు అనుభవించే ఒత్తిడి, ఆకృతులు... వేగస్‌ నాడితో సంభాషించే పాదాల్లోని రిఫ్లెక్సాలజీ పాయింట్స్‌ను ప్రేరేపిస్తాయి. ప్రేరేపితమైన వేగస్‌ నాడి, ఒత్తిడిని అణచివేసే స్విచ్‌లా పని చేస్తుంది. ఏకాగ్రత శరీరంతోనే మొదలవుతుంది. పిల్లలు భౌతికంగా నేలను తాకలేనప్పుడు, వాళ్ల మెదడు గాఢమైన ఏకాగ్రతను అందుకోలేదు. సాక్సులు, చెప్పులు తొడగని పిల్లలు వాళ్ల పాదాల మునివేళ్లతో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఫలితంగా పాదాల్లో వంపు ఏర్పడుతుంది, వెన్ను సమం అవుతుంది. కాబట్టి పసికందులకు సాక్సులు, చెప్పులు వేయడం మానేయడం మంచిది. అలాగే అప్పుడప్పుడే నడక మొదలు పెట్టిన పిల్లలను గడ్డి మీద, ఇసుక మీద, నున్నటి రాళ్ల మీద నడిపిస్తూ ఉండాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

మొయినాబాద్‌ డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్‌ ఎస్పీ గిరిధర్‌

రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు

ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 17 , 2026 | 12:23 AM