Share News

14 రోజులు చక్కెర మానేస్తే?

ABN , Publish Date - Nov 17 , 2026 | 04:27 AM

టీలు, కాఫీలు, స్వీట్లు, కూల్‌డ్రింక్స్‌... ఇలా మనం ప్రతి రోజూ ఎంతో కొంత చక్కెరను శరీరంలోకి చేరవేస్తూ ఉంటాం. అయితే ఈ అదనపు చక్కెరలతో ఊబకాయం, టైప్‌2 మధుమేహం ముప్పు పొంచి ఉంటుంది. కాబట్టి...

14 రోజులు చక్కెర మానేస్తే?

హెల్త్‌ వెల్త్‌

టీలు, కాఫీలు, స్వీట్లు, కూల్‌డ్రింక్స్‌... ఇలా మనం ప్రతి రోజూ ఎంతో కొంత చక్కెరను శరీరంలోకి చేరవేస్తూ ఉంటాం. అయితే ఈ అదనపు చక్కెరలతో ఊబకాయం, టైప్‌2 మధుమేహం ముప్పు పొంచి ఉంటుంది. కాబట్టి 14 రోజుల పాటు చక్కెరను దూరం పెట్టి, దాంతో ఒరిగే ఆరోగ్య ప్రయోజనాలను అనుభవపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి.

చక్కెరతో పదార్థాల తీయదనం పెరుగుతుంది, వాటిని ఇష్టంగా తింటాం. అయితే చక్కెరతో ఒరిగే నష్టం ఇదొక్కటే కాదు. అది నిశ్శబ్దంగా పదార్థాల మీద యావను పెంచుతుంది. ఆకలిని తీవ్రం చేస్తుంది. ఇన్సులిన్‌ను, కాలేయ కొవ్వును కూడా పెంచేస్తుంది. కాబట్టి 14 రోజుల పాటు చక్కెరకు చెక్‌ పెట్టి మన ఆరోగ్యానికి ఒరిగే ప్రయోజనాలను గమనిద్దాం!

మొదటి మూడు రోజులు: చాలా కష్టంగా ఉంటుంది. తీపి తినాలనే కోరికలు వేధిస్తాయి. తలనొప్పులు మొదలవుతాయి. చికాకు, భావోద్వేగాల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. బ్రెయిన్‌ ఫాగ్‌, ఏకాగ్రతా లోపాలు కూడా వేధిస్తాయి.

4 నుంచి 7 రోజులు: శరీరం సర్దుకోవడం మొదలుపెడుతుంది. శక్తి స్థిరంగా కొనసాగుతుంది. తీపి మీద యావ తగ్గుతుంది. రక్తంలో చక్కెర పెరుగుదల ఆగుతుంది. కడుపుబ్బరం తగ్గిపోతుంది. శరీరం అసలైన ఆహారం నుంచి శక్తిని సంగ్రహించడం మొదలుపెడుతుంది.

8 నుంచి 14 రోజులు: అసలైన ప్రయోజనాలు స్పష్టంగా కనిపించడం మొదలుపెడతాయి. పొట్ట చదునుగా మారుతుంది. శరీరంలో నీటి నిల్వ తగ్గిపోతుంది. ఇన్‌ఫ్లమేషన్‌ అదుపులోకొస్తుంది. రక్తంలో చక్కెర స్థిరంగా ఉంటుంది. ఫాస్టింగ్‌ గ్లూకోజ్‌ మెరుగు పడుతుంది. అలవాటు చొప్పున తినేయకుండా అసలైన ఆకలిని కనిపెట్టి, అవసరమైనప్పుడే తినగలుగుతాం! నిద్ర మెరుగు పడుతుంది.

ఇలా 14 రోజుల పాటు చక్కెరను దూరం పెట్టగలిగితే, నాలుకలోని రుచి మొగ్గలు చురుగ్గా మారి, తీపి పదార్థాలు వెగటు కలిగిస్తాయి. దాంతో వాటి మీద యావ తగ్గిపోతుంది. కాబట్టి చక్కెరను దూరం పెట్టడం కోసం 14 రోజుల చక్కెర ఉపవాసం పాటించడం అవసరం.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Updated Date - Nov 17 , 2026 | 04:27 AM