వహ్వా.. వాల్‌నట్స్..
ABN , Publish Date - Jun 10 , 2026 | 02:40 AM
మెదడు ఆకారంలో కనిపించే వాల్‌నట్స్‌ను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...
మెదడు ఆకారంలో కనిపించే వాల్‌నట్స్‌ను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...
వాల్‌నట్స్‌ను నేరుగా తినడం కంటే రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది. దీనివల్ల వాటిలోని పోషకాలు, విటమిన్లు త్వరగా శరీరానికి అందుతాయి.
వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఉత్తేజితం చేసి ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. వాల్‌నట్స్‌ను చిన్న పలుకులుగా చేసి చిన్న పిల్లలకు తినిపిస్తుంటే వారిలో మేథా శక్తి పెరుగుతుంది.
వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.
రోజూ నాలుగైదు వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. శరీరంలో ఇన్సులిన్ పనితీరు మెరుగుపడి టైప్ 2 మధుమేహం అదుపులో ఉంటుంది.
వాల్‌నట్స్‌లో పీచులు అధికం. ఇవి జీర్ణక్రియ సజావుగా జరగడానికి దోహదం చేస్తాయి. అల్పాహారంతోపాటు వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల మలబద్దకం దరిచేరదు. అతిగా తినాలనే కోరిక తగ్గి శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.
తరచూ వాల్‌నట్స్‌ను తినడం వల్ల వాటిలో అధికంగా ఉండే ఇ విటమిన్... చర్మం నిగారించేందుకు, చుండ్రు నివారణకు, శిరోజాలు ఒత్తుగా పెరిగేందుకు తోడ్పడుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్
ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News