గోడలపై నీటి మరకలా..?
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:53 AM
అధిక వర్షాలు, పై కప్పు లేదా నీటి పైపుల సమస్యల కారణంగా నీరు ఇంకి ఇంటి గోడలపై మరకలు ఏర్పడుతుంటాయి. ఒక్కోసారి నలుపు, ఆకుపచ్చ రంగుల్లో బూజు, నాచు మరకలు కూడా కనిపిస్తుంటాయి. వీటిని సులువుగా తొలగించే చిట్కాలివే...
అధిక వర్షాలు, పై కప్పు లేదా నీటి పైపుల సమస్యల కారణంగా నీరు ఇంకి ఇంటి గోడలపై మరకలు ఏర్పడుతుంటాయి. ఒక్కోసారి నలుపు, ఆకుపచ్చ రంగుల్లో బూజు, నాచు మరకలు కూడా కనిపిస్తుంటాయి. వీటిని సులువుగా తొలగించే చిట్కాలివే...
చిన్న గిన్నెలో యాపిల్ సైడర్ వెనిగర్, నీటిని సమపాళ్లలో తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గోడ మరకలపై చల్లి గంట తరువాత నీటితో కడిగేస్తే సరిపోతుంది.
ఒక కప్పు వేడి నీటిలో రెండు చెంచాల డిష్ వాషింగ్ లిక్విడ్ వేసి బాగా కలపాలి. దీన్ని ఓ స్ర్పే బాటిల్‌లో పోసి గోడ మరకలపై స్ర్పేచేసి అరగంట తరువాత నీటితో కడిగేస్తే ఎలాంటి మరకలైనా సులువుగా వదిలిపోతాయి.
చిన్న గిన్నెలో రెండు చెంచాల బేకింగ్ సోడా, మూడు చెంచాల నిమ్మరసం వేసి పేస్టులా చేయాలి. దీన్ని మరకలపై రాసి గంట తరువాత పలుచని పేపర్ లేదా టిష్యూతో తుడిచేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది
మరకలు, బూజు ఉన్నచోట బ్లీచింగ్ పౌడర్ చల్లి పాత టూత్‌బ్రష్‌తో రుద్దితే ప్రయోజనం ఉంటుంది.
మార్కెట్లో దొరికే 3 శాతం హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను తెచ్చి స్ర్పే చేసి పావుగంట తరువాత పాత గుడ్డతో తుడిచేస్తే మరకలన్నీ తొలగిపోతాయి.
ఒక గ్లాసు నీటిలో ఇరవై చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి బాగా కలిపి పిచికారీ చేస్తే బూజు, నాచు తదితర మరకలు తొలగి గోడలు కొత్తగా మెరుస్తాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సమస్యలపై దృష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన
అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు
Read Latest AP News And Telugu News