Share News

కళ్ల కింద వాపు తగ్గేదెలా..?

ABN , Publish Date - Nov 18 , 2026 | 03:30 AM

ఒక్కోసారి ఉదయం నిద్రలేవగానే కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తుంటాయి. అలసటతోపాటు కళ్ల చుట్టూ ఉండే మృదువైన కణజాలం ఒత్తిడికి గురికావడం వల్ల ఎదురయ్యే ఈ సమస్యని నివారించే...

కళ్ల కింద వాపు తగ్గేదెలా..?

ఒక్కోసారి ఉదయం నిద్రలేవగానే కళ్లు ఉబ్బినట్లు కనిపిస్తుంటాయి. అలసటతోపాటు కళ్ల చుట్టూ ఉండే మృదువైన కణజాలం ఒత్తిడికి గురికావడం వల్ల ఎదురయ్యే ఈ సమస్యని నివారించే ఇంటి చిట్కాలివే...

  • కీర దోస లేదా బంగాళదుంపను సన్నటి చక్రాల్లా కోసి కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. తరువాత వాటిని కళ్లపై పెట్టుకుని అరగంటసేపు విశ్రాంతి తీసుకుంటే వాపు తగ్గుతుంది. అలాగే స్టీల్‌ చెంచాలు, వాడేసిన గ్రీన్‌ టీ బ్యాగ్స్‌ను కూడా ఉపయోగించవచ్చు.

  • చల్లటి పాలలో దూదిని ముంచి కళ్ల చుట్టూ అద్దుతుంటే పావుగంటలో మంచి ఫలితం

    కనిపిస్తుంది.

  • కాఫీ డికాక్షన్‌ను ఫ్రిజ్‌లో క్యూబ్స్‌లా మార్చి వాటిని పలుచని రుమాలులో చుట్టి కళ్ల చుట్టూ నెమ్మదిగా మర్దన చేసినా ప్రయోజనం ఉంటుంది.

  • ఉదయం లేవగానే చల్లటి నీటిని కళ్లపై చల్లుకుంటూ ముఖం కడుక్కుంటే చాలావరకు సమస్య తీరుతుంది.

  • రోజుకు కనీసం ఎనిమిది గంటలు గాఢంగా నిద్రించాలి. స్ర్కీన్‌ టైమ్‌ను తగ్గించుకోవాలి.

  • శరీరంలో నీటి శాతం తగ్గితే డీహైడ్రేషన్‌ వల్ల కళ్లు ఉబ్బుతాయి. కాబట్టి దాహం అనిపించకపోయినా తరచూ మంచినీటిని తాగుతుండాలి.

  • నీరు అధికంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. కాఫీ, టీలను ఎక్కువగా తాగకూడదు. ఉప్పు వాడకాన్ని తగ్గించాలి.

  • పడుకునేముందు తలకింద అదనపు దిండును పెట్టుకోవడం ప్రయోజనకరం.

ఇవి కూడా చదవండి...

కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 03:30 AM