వీటిలోనూ ప్రొటీన్
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:12 AM
మాంసకృత్తులు అనగానే ఎవరికైనా మాంసాహారమే గుర్తొస్తుంది. కానీ కొన్ని తృణధాన్యాల్లో ఎముకలు, కండరాలను బలపరిచే మేలు రకం మాంసకృత్తులుంటాయి...
గుడ్ ఫుడ్
మాంసకృత్తులు అనగానే ఎవరికైనా మాంసాహారమే గుర్తొస్తుంది. కానీ కొన్ని తృణధాన్యాల్లో ఎముకలు, కండరాలను బలపరిచే మేలు రకం మాంసకృత్తులుంటాయి. వాటి గురించి తెలుసుకుందాం!
క్వినోవా
ఈ తృణధాన్యంలో అత్యధిక ప్రొటీన్లుంటాయి. పీచుతో కూడిన ఈ తృణధాన్యాన్ని నీళ్లలో ఉడికించి, కూరగాయలతో కలిపి తినొచ్చు. ఆకుకూరల సలాడ్ మీద చల్లుకుని తినొచ్చు. లేదాంటే ఓట్‌మీల్ మాదిరిగా పాలతో కలిపి, నట్స్, సీడ్స్, పండ్ల ముక్కలు చల్లుకుని తినొచ్చు. ఒక కప్పు క్వినోవాలో 8 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.
అడవి బియ్యం
బ్రౌన్, వైల్డ్ రైస్‌లో తక్కువ పిండిపదార్థాలు ఎక్కువ పీచు, ప్రొటీన్ ఉంటాయి. పర్పుల్ బ్లాక్ రైస్‌లో బి విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్ కూడా ఉంటాయి. ఈ బియాన్ని ప్రధాన భోజనంలా లంచ్, డిన్నర్‌లో తినొచ్చు. ఒక కప్పు వైల్డ్ రైస్‌లో ఆరున్నర గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.
అమరాంథ్
తోటకూర విత్తనాలు ప్రధానంగా హృద్రోగులు, టైప్2 మధుమేహులకు ఆరోగ్యకరం. తోటకూర విత్తనాల్లో యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అలాగే బి విటమిన్లు, కాపర్, జింక్, మాంగనీస్ మొదలైన ఖనిజాలు కూడా ఉంటాయి. ఉడికించినప్పుడు మెత్తగా జారుడుగా తయారయ్యే ఈ విత్తనాలను ఓట్స్ మాదిరిగా తినొచ్చు. ఒక కప్పు తోటకూర విత్తనాల్లో తొమ్మిది గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ ఆహ్వానం..
చంద్రబాబుకు మేమెందుకు సహకరిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
Read Latest Telangana News And AP News And Telugu News