అందాన్ని నియంత్రించే హార్మోన్లు
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:28 AM
మహిళల అందం 3 కీలక హార్మోన్ల మీదే ఆధారపడుతుంది. అవి సక్రమంగా స్రవిస్తున్నంత కాలం చర్మం మెరుపులీనుతూ, నవయవ్వనాన్ని ప్రతిఫలిస్తూ ఉంటుంది...
మహిళల అందం 3 కీలక హార్మోన్ల మీదే ఆధారపడుతుంది. అవి సక్రమంగా స్రవిస్తున్నంత కాలం చర్మం మెరుపులీనుతూ, నవయవ్వనాన్ని ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆ హార్మోన్లు, వాటిని గాడిలో పెట్టే విధానాల గురించి తెలుసుకుందాం!
ఈస్ట్రోజన్: స్త్రీత్వాన్ని పెంచే హార్మోన్ ఇది. చర్మపు సాంద్రత, చర్మం మీద ముడతలు, వెంట్రుకల పెరుగుదల, కళ్లలో మెరుపు.. వీటన్నిటికీ ఈస్ట్రోజన్ హార్మోన్ కారణం. ఈ హార్మోన్ తగ్గితే, మానసిక కుంగుబాటు వేధిస్తుంది. చర్మం నిర్జీవంగా మారుతుంది. వెంట్రుకలు రాలిపోతాయి. చర్మం పొడిబారుతుంది. లైంగిక కోరికలు తగ్గుతాయి. ఈ హార్మోన్‌ను పెంచుకోవాలంటే, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కంటి నిండా నిద్రపోవాలి. అలాగే అవిసె గింజలు, నట్స్, నువ్వులు, క్రూసిఫెరస్ కూరగాయలైన కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రొకొలి తినాలి. అవకాడొ, గుడ్లు, చేపలు, ఒమేగా 3 తీసుకోవాలి.
కార్టిసాల్: అందాన్ని హరించే హార్మోన్ ఇది. ఒత్తిడి అదుపు, రక్తంలో చక్కెర మోతాదులు, ముఖం వాపు, మొటిమలు, కండర కణజాల క్షీణత... వీటన్నిటికీ కార్టిసాల్ హార్మోన్ ప్రధాన కారణం. కార్టిసాల్ పెరిగితే, వాపులు, నిద్రలేమి, నిస్సత్తువ, బరువు పెరగడం, మొటిమలు మొదలైన సమస్యలు వేధిస్తాయి. ఈ హార్మోన్‌ను తగ్గించడం కోసం, ఒత్తిడిని తగ్గించుకుని, మానసిక సాంత్వన పొందే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. నిద్రకు గంట ముందు సెల్‌ఫోన్, టివి చూసే అలవాటు మానేయాలి. కార్టిసాల్ తగ్గించుకోవడం కోసం, డార్క్ చాక్లెట్, గుమ్మడి విత్తనాలు తినాలి. గ్రీన్ టీ తాగాలి. మెగ్నీషియం, విటమిన్ సి తీసుకోవాలి. పరగడుపున కాఫీ తాగడం మానేయాలి
ఆక్సిటోసిస్: చర్మపు మెరుపును పెంచే హార్మోన్ ఇది. కణ పునరుజ్జీవాన్ని పెంచుతుంది. రక్తప్రసరణ, మానసిక ప్రశాంతత, ఉల్లాసాలను పెంచుతుంది. ఆక్సిటోసిన్ లోపం పలు లక్షణాల రూపంలో బయల్పడుతుంది. శరీరంలో టెన్షన్, ముఖంలో ఆందోళన ప్రతిఫలిస్తూ ఉంటాయి.
ఈ హార్మోన్‌ను పెంచడం కోసం, భౌతిక స్పర్శ, మర్దన, పెంపుడు జంతువులతో ఆటలు, మనసుకు నచ్చిన వారితో మనసు విప్పి మాట్లాడుకోవడం చేయాలి. ఆక్సిటోసిన్ పని చేయడానికి విటమిన్ డి, మెగ్నీషియం, ప్రొబయాటిక్స్ లాంటి ఇంకొన్ని పోషకాల తోడ్పాటు కూడా అవసరమవుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్ ఎస్పీ గిరిధర్
రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు
ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News