పండ్ల మొక్కల కోసం...
ABN , Publish Date - Nov 11 , 2026 | 01:12 AM
మిద్దెతోటలో పండ్ల మొక్కలను పెంచేటప్పుడు అవి ఏపుగా పెరిగినప్పటికీ సరైన విధంగా కాపు రాకపోవడం, పిందెలు రాలిపోవడం...
మిద్దెతోటలో పండ్ల మొక్కలను పెంచేటప్పుడు అవి ఏపుగా పెరిగినప్పటికీ సరైన విధంగా కాపు రాకపోవడం, పిందెలు రాలిపోవడం గమనిస్తుంటాం. అలాకాకుండా పండ్లు విరివిగా కాసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...
మొక్కలకు ఫాస్పరస్, కాల్షియం, పొటాషియం లాంటి సూక్ష్మ పోషకాలు అందేలా ఆర్గానిక్ ఎరువుల మిశ్రమాన్ని అందించాలి. వేపపిండి, ఆవుపేడ, వర్మీ కంపోస్టులను మట్టిలో కలపాలి. అలాగే గుడ్ల పెంకులను పొడిలా చేసి కలపవచ్చు.
మొక్కల స్వభావాన్ని అనుసరించి నీటిని అందించాలి. మట్టి తడారిపోకుండా అలాగే నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేర్లు తేమగా ఉండేందుకు మొక్కల చుట్టూ ఎండు గడ్డి, కొబ్బరి పీచు పరచాలి.
ఆకులకు, కాండానికి తెగుళ్లు రాకుండా వెనిగర్ లేదా వెల్లుల్లి ముద్ద కలిపిన నీటిని మొక్కలపై పిచికారీ చేయాలి. అలాగే బేకింగ్ సోడా, వేపనూనె కలిపిన నీటిని స్ర్పే చేస్తే క్రిమికీటకాలు చేరవు.
అదనంగా పెరిగిన కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తుంటే కొత్త చిగుళ్లు వచ్చి కాయలు విరివిగా కాస్తాయి. క్రమంగా పండ్ల పరిమాణం కూడా పెరుగుతుంది. కాయలు పెద్దవవుతున్నప్పుడు వాటికి పలుచని ఫ్రూట్ కవర్స్‌ను తొడిగితే ఈగలు, దోమలు, ఇతరత్రా పురుగులు, పక్షుల నుంచి రక్షణ లభిస్తుంది.
రోజూ మొక్కలకు కనీసం ఆరుగంటలు సూర్యరశ్మి తగిలేలా చూడాలి. ఎండ మరీ ఎక్కువగా ఉన్నట్లయితే మిద్దె తోటకు గ్రీన్ షేడ్ నెట్‌ను ఏర్పాటు చేయాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
416 గ్రామాల్లో భూ రీసర్వే పూర్తి.. భూదార్ నంబర్ల కేటాయింపుపై పొంగులేటి కీలక ఆదేశాలు
గూడూరులో దారుణం.. రూ.500 అప్పు తిరిగివ్వలేదని వ్యక్తిపై వేడి నూనె పోసిన మహిళ
Read Latest TG Govt And Telugu News