Share News

ఓటమిని స్వీకరించడం నేర్పండి

ABN , Publish Date - Feb 12 , 2026 | 04:16 AM

నేటి పోటీ ప్రపంచంలో పిల్లలు ఎప్పుడూ గెలవాలని, అందరికంటే ముందుండాలని ఒత్తిడికి గురవుతుంటారు. ఓటమి ఎదురైనప్పుడు

ఓటమిని స్వీకరించడం నేర్పండి

నేటి పోటీ ప్రపంచంలో పిల్లలు ఎప్పుడూ గెలవాలని, అందరికంటే ముందుండాలని ఒత్తిడికి గురవుతుంటారు. ఓటమి ఎదురైనప్పుడు వారు కుంగిపోకుండా ఉండాలంటే..

  • శ్రమను గుర్తించండి: మార్కుల కంటే లక్ష్యం కోసం వారి కష్టాన్ని, అంకితభావాన్ని మెచ్చుకోండి. ‘నువ్వు ఈ రోజు గెలవకపోవచ్చు, కానీ నీ శ్రమ నాకు చాలా గర్వంగా అనిపించింది’’ అనే ఒక్క మాట వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.

  • విమర్శించవద్దు: ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఓడిపోయినప్పుడు మందలించడం వల్ల వారు భవిష్యత్తులో కొత్త పనులు చేయడానికి భయపడతారు. దానికి బదులుగా ‘‘ఎక్కడ తప్పు జరిగింది? ఎలా మెరుగుపరుచుకోవచ్చు?’ అని చర్చించండి.

  • ప్రత్యర్థిని అభినందించడం: మనం ఓడిపోయినప్పుడు ప్రత్యర్థిని అభినందించడం అనేది గొప్ప సంస్కారం. ఇది వారిలో అసూయను తగ్గించి, పక్కవారి పట్ల గౌరవాన్ని పెంచుతుంది.

  • సహజత్వం: ఆటల్లో గెలుపోటములు సహజమని, ఈ రోజు ఓడితే రేపు గెలవడానికి అవకాశం ఉంటుందని చెప్పాలి.

  • రోల్‌మోడల్‌: పిల్లలు మీరు చెప్పే మాటల కంటే, మీరు చేసే పనులనే ఎక్కువగా గమనిస్తారు. మీరు ఓటమిని ధైర్యంగా స్వీకరిస్తే, వారు కూడా అదే బాటలో నడుస్తారు.

  • ఎమోషనల్‌ సపోర్ట్‌: ఓడిపోయినప్పుడు పిల్లలు బాధపడటం సహజం. ఆ బాధను తక్కువ చేయకుండా ‘నీకు బాధగా ఉందని నాకు తెలుసు, పర్వాలేదు’ అని వారిని దగ్గరకు తీసుకోండి. వారి భావాలను గౌరవిస్తూనే, ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చి మళ్లీ ప్రయత్నించేలా ప్రోత్సహించాలి.

ఇవి కూడా చదవండి...

కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌‌కు బండి సంజయ్ సూటిప్రశ్న

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 12 , 2026 | 04:16 AM